మీ జుట్టు తెల్లగా మారడానికి కారణం ఏంటో తెలుసా.?

kalpana
ఈ మధ్యకాలంలో సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు తెల్లబడడం అనే సమస్య కూడా ప్రధానమైనదిగా చెప్పవచ్చు. సాధారణంగా మనకు 35 నుంచి 40 సంవత్సరాల తర్వాత జుట్టు తెల్లబడటం అనేది సాధారణమైన ప్రక్రియ. అయితే ప్రస్తుత కాలంలో 20 సంవత్సరముల లోపు వారిని కూడా జుట్టు తెల్లబడటం అనే సమస్య వేధిస్తోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఓ జబ్బుగా పరిగణించవచ్చును అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. జుట్టు తెల్లబడడం అనే సమస్యను వైద్య పరిభాషలో  కెనాయిటిస్ అని పిలుస్తారు. ప్రధానంగా విటమిన్ డి లోపం, కాల్షియం లోపం, ఐరన్ లోపం , మానసిక ఒత్తిడి, కాలుష్యం, హైపర్ థైరాయిడిజం, హార్మోన్ల అసమతుల్యత,  రక్తహీనత, వంశపారంపర్యం వంటి కారణాల వల్ల జుట్టు తెల్లబడటం అనే సమస్య రావచ్చు.
ఈ తెల్లజుట్టు సమస్యను అధిగమించటానికి రసాయనాలతో నిండిన షాంపూలను, హెయిర్ కలర్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు దాంతో ఇతర అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు కాబట్టి ఇంట్లోనే సహజ సిద్ధంగా దొరికే కొన్ని రకాల పదార్థాలతో తెల్ల జుట్టు సమస్యలు అధిగమించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.

మనం ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లతో పాటు మన ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ జింక్, వంటివి పుష్కలంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఆహారపు అలవాట్లను చిన్న వయస్సు నుంచే అలవరచుకుంటే ఈ జుట్టు తెల్లబడటం అనే సమస్య నుంచి బయట పడవచ్చు.

తాజా కరివేపాకులను పేస్టులాగ చేసి, తగినంత కొబ్బరి నూనెను కలిపి ఆ మిశ్రమంలోని తేమ ఆవిరయ్యే వరకు మరిగించాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని వారంలో రెండు సార్లు తలకి వాడితే క్రమంగా జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.

మందార పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఆల్ మండ్ ఆయిల్ తో కలిపి రాత్రి పూట తలకు పట్టించి ఉదయాన్నే హెడ్ బాత్ చేయడం వల్ల తెల్లబడ్డ జుట్టు కూడా క్రమేపి నల్లబడుతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.

కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి ఆ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేసుకుంటే తెల్ల జుట్టు సమస్యలను నివారించవచ్చు.

మందార ఆకులను మెత్తగా పేస్ట్  చేసుకుని కొబ్బరి నూనె కలిపి దానిని జుట్టుకి పట్టించాలి.  2 గంటల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు తెల్లబడటం మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చు.

రెండు మూడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

తెల్ల జుట్టును నివారించే సహజ హోం రెమడీ మెంతులు గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి

తలస్నానానికి సాధ్యమైనంత వరకు సహజంగా లభించే కుంకుడుకాయి, శీకాయి వాడాలి. అలాగే శుభ్రమైన కొబ్బరి నూనె వెంట్రుకల కుదుళ్ళకు అంటుకునేలా మసాజ్ చేస్తుంటే ఆరోగ్యకరమైన జుట్టు తో పాటు తెల్ల జుట్టు ను నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: