బీట్రూట్ తో కంటి చూపు మెరుగు పడుతుందా..?

kalpana
 అమ్మ ఎప్పుడైనా బీట్రూట్ వండితే ఆ రోజు ఇంట్లో ఓ చిన్న సైజు యుద్ధం జరిగిపోతుంది. ‘ఈ కూర ఎందుకు వండావ్?’ అంటూ రుసరుసలాడేవారు ఎక్కువ మందే ఉంటారు. బీట్రూట్ జ్యూస్ తాగమంటే ముఖం ఆముదం తాగమన్నట్లుగా పెట్టేవారు సైతం ఉంటారు. అసలు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకొంటే మనం ఇలా మాట్లాడం. రక్తహీనతతో బాధపడేవారికి ఆహారంలో బీట్రూట్ భాగం చేసుకోమని, బీట్రూట్ జ్యూస్ తాగమని సూచిస్తారు వైద్యులు. అసలు అంత గొప్ప పోషకాలు ఏముంటాయి బీట్రూట్‌లో అని అనిపిస్తోంది కదా?


అంతేకాదు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా బీట్‌రూట్‌ తర్వాతే మరేదైనా. అయితే, ఇది క్యారెట్‌లా రుచిగా ఉండదు. వగరుగా  చప్పగా అనిపిస్తుంది. కాబట్టి  దీన్ని సలాడ్ రూపంలో తీసుకుంటే బెటర్. ఈ సలాడ్‌ను రోజూ తీసుకుంటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరి సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా!


 బీట్ రూట్‌పై ఉండే తొక్కను తీసేసి నీళ్లలో వేసి ఉడికించాలి. అందులో కాస్త ఉప్పు వేయండి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో వేయాలి. తర్వాత ఉల్లిపాయలను తరిగి బీట్ రూట్ ముక్కలతో కలిపేయాలి. తర్వాత ఆలివ్ ఆయిల్, వెనిగర్‌తో పాటు రుచి కోసం కొద్దిగా ఉప్పు వేయండి. చివర్లో ఈ సలాడ్ మీద కొంచెం వెనిగర్ చల్లి గంటపాటు పక్కన పెట్టండి. అంతే బీట్ రూట్ సిద్ధం.


 ఈ సలాడ్‌ను రోజూ తినడం వల్ల పెద్ద పేగు, కాలేయం శుద్ధి అవుతాయి.బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.బీట్‌రూట్ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.


 అనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు.డయాబెటిక్ రోగులు బీట్‌రూట్ తీసుకుంటే లివర్‌ సంబంధ సమస్యలు తలెత్తవు.బీట్‌రూట్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.బీట్‌రూట్ మలబద్దకాన్ని నివారిస్తుంది.బీటర్‌రూట్ బోరాన్ లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును నియంత్రిస్తుంది.గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.బీట్‌రూట్ మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగాన్ని పెంచి చురుగ్గా ఆలోచించే శక్తిని ఇస్తుంది.ఈ దుంపలోని నైట్రేట్లు రక్తంలో కలిసిన తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి.


నైట్రేట్లతోపాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటాయి.కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం బీట్‌రూట్‌లో ఉంది. చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌-B బీట్‌రూట్‌‌లో పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెదవులు పొడిబారకుండా బీట్‌రూట్ కాపాడుతుంది.బీట్‌రూట్‌లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.రక్తనాళాలు, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: