కొబ్బరి పువ్వు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందట..!
కొబ్బరికాయలు దేవుడి ముందు కొట్టినప్పుడు లేక వంటల్లో వాడుకోవడానికి ఉపయోగించినప్పుడు, కొబ్బరికాయ లోపల స్పాంజి లాంటి ఒక భాగం మనకు కనిపిస్తుంది. దాన్నే కొబ్బరి పువ్వు అని అంటారు.. పూర్వకాలంలో కొబ్బరికాయను దేవుడికి కొట్టేటప్పుడు, కొబ్బరికాయ లోపల ఈ పువ్వు కనిపిస్తే,శుభం జరుగుతుంది అని చెప్పేవాళ్ళు.. అది శుభమో..కాదో తెలియదు కానీ ఈ పువ్వు తింటే మాత్రం నిజంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వైద్యులు చెబుతున్నారు.
కొబ్బరి పువ్వులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణం లో ముఖ్య పాత్ర వహిస్తోంది. అంతే కాకుండా క్రీడాకారులకు గొప్ప దేహదారుడ్యం రావాలి అంటే ఈ కొబ్బరి పువ్వు తినాల్సిందే..
అంతేకాకుండా మన శరీరానికి వివిధ ఆహార పదార్థాల నుండి అందే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ సమృద్ధిగా జీర్ణం అవ్వాలి అంటే కొబ్బరి పువ్వు సహకరిస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కొబ్బరి పువ్వు తినడం వల్ల, శరీరంలో ఇన్సులిన్ సమతాస్థితిలో ఉండేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా వయస్సు పెరిగేకొద్దీ ముఖంలో కనిపించే వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి ఈ కొబ్బరి పువ్వుకు ఉంది. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరును పెంపొందించి, ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది.
జుట్టు తో పాటు చర్మాన్ని కూడా అందంగా మార్చే శక్తి ఈ కొబ్బరి పువ్వు కు ఉంది. అంతే కాకుండా ముఖం మీద ముడతలు రావడం, మచ్చలు రావడం, చర్మం వదులవడం, కళ కోల్పోవడం ఇలాంటి సమస్యల నుంచి ఈ కొబ్బరి పువ్వు కాపాడుతుంది. కొబ్బరి పువ్వు లో ఎక్కువ శాతం నీరు అలాగే ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాక శరీరం డీహైడ్రేట్ కాకుండా సహాయపడుతుంది.