ధనియాలతో డయాబెటిస్ రోగులకు ఇలా చెక్ పెట్టవచ్చు..!
ధనియాలను మరీ ముఖ్యంగా మసాలా దినుసులలో ఉపయోగించడమే కాకుండా కొత్తిమీర లేని వంట ఏదీ లేదు. ఏ వంట కైనా కొద్దిగా కొత్తిమీర ను జోడిస్తేనే,ఆ వంటకు తప్పకుండా రుచి వస్తుంది. రుచి,సువాసనను అందించే కొత్తిమీర లో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటి ద్వారా వచ్చే విత్తనాలు..వాటినే మనం ధనియాలు అని అంటాము. ధనియాలలో ఎన్నో పోషకాలు దాగివున్నాయని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే ధనియాల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ధనియాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పని చేస్తాయి. "ది బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్" లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కొత్తిమీర విత్తనాలలో డయాబెటిస్ బాధితులకు, ఉపయోగపడే ఎన్నో సమ్మేళనాలు అధికంగా ఉన్నాయని తేలింది. అవి రక్తంలో విడుదల అయ్యేటప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడే యాంటీ హైపర్గ్లీకేమిక్, ఇన్సులిన్ డిస్చార్జింగ్, ఇన్సులిన్ ఉత్పత్తి వంటివి కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఎప్పుడైతే కొత్తిమీరను ఆహారంలో కలిపి తింటామో,అప్పుడు ఇందులో ఉండే ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని తేలింది.
కొత్తిమీర ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇందుకోసం 10 గ్రాముల ధనియాల పొడిని తీసుకొని, రెండు లీటర్ల నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టుకోవాలి. ఒక సీసాలో భద్రపరుచుకుని,రోజులో కొద్దికొద్దిగా తాగుతూ ఉండవచ్చు. ఇక అలాగే కొత్తిమీర రసం తో కిడ్నీలను సైతం శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ కె,ఐరన్ వంటి ప్రోటీన్లు ఉన్నాయి. అలాగే క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉన్నాయి.
ఆహారం జీర్ణం కావడానికి, కాలేయం పనితీరు మెరుగు పడ్డానికి, అల్జీమర్ చికిత్సకు, గొంతు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎముకలు దృడంగా మారుతాయి. మలబద్దకం, కడుపులో మంట వంటి వాటి నుంచి దూరంగా ఉండవచ్చు.