అరికెలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది... అది ఎలాగంటే...?

kalpana
 అరికెలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అరికెలు తీపి,వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధిక పోషక విలువలు ఉన్నాయి.  అందుకే పిల్లలకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. అరికెల్లో విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అరికెలు తినడం వల్ల  ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 అరికెలు తినడం వల్ల జీర్ణశక్తి సక్రమంగా జరగడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఇందులో అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివ్ గా ఉంటాయి.

 రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి అరికెలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పరుగు పందెం లో పాల్గొనే వారికి మంచి శక్తిని ఇస్తాయి.

 అరికెల ను డైరెక్ట్ గా తీసుకోకుండా ఇతర పప్పుదినుసుల (బొబ్బర్లు, శనగలు )తో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా అందుతాయి.

 అరికెల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల బరువు  తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కలిగే వాపులను, నొప్పులను నివారిస్తాయి.

 వాత రోగాలకు, కీళ్లవాతానికి అరికెలు తినడం వల్ల ఈ  సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రుతుస్రావము సక్రమంగా రాని మహిళలకు అరికెలు అవసరం లా పనిచేస్తాయి.

 మధుమేహ వ్యాధిగ్రస్తులు అరికలు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.  అంతే కాకుండా కంటి నరాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఇంకా వాపులు ఉన్నచోట హారిక పిండిని పైపూతగా పోయడం వల్ల వాపులు తగ్గుతాయి.

 రక్తాన్ని అరికెలు శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా   ఎముకల్లో గుజ్జు పెరగడానికి అరికెలు సహాయపడతాయి.

 ఆస్తమా వ్యాధి, మూత్రపిండాలు, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్, ప్రేగు  క్యాన్సర్  , మరియు గొంతు థైరాయిడ్, క్లోమగ్రంథి లు, కాలేయపు క్యాన్సర్లను తగ్గించడానికి అరికెలు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా చక్కెర వ్యాధి ఉన్న వాళ్లకి గాయాలు ఉంటే వాటిని నయం చేయడానికి అరికెలు సహాయపడతాయి.

 డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరాలు వచ్చి నీరసంగా ఉన్న వాళ్లకి అరికెలు తినడం వల్ల రక్తం శుద్ధి అయి నీరసం లేకుండా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: