ఆ చెట్టు ఆకుల రసాన్ని అక్కడ రాస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Divya

మనకు ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు, ప్రతి మొక్క ఏదో ఒక ఉపయోగాన్ని కలిగి ఉంటుంది. ఆ చెట్టు లేదా మొక్క యొక్క ఆకులు,వేర్లు,బెరడు,విత్తనాలు ఇలా అన్నీ మనకు ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో సీజనల్ గా దొరికే పండు సీతాఫలం. సీతాఫలం యొక్క ఆకులు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సీతాఫలం లో విటమిన్ సి,యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి,రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం ల కారణంగా గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే రక్తపోటును నియంత్రించుకోవచ్చు. అలాగే కళ్ళకు, జుట్టుకు, చర్మానికి ఎంతగానో సహాయపడుతుంది.  అజీర్తి సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఇందులో ఉండే కాపర్ మలబద్ధకాన్ని నయం చేయడానికి సహాయపడడం తోపాటు విరేచనాలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.


కీళ్ల నుండి ఆమ్లాలను తొలగించి,రుమాటిజం,ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తహీనత నుండి కూడా బయటపడవచ్చు. అలాగే ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ పోషకాన్ని తగినంత తీసుకోవడం వల్ల మానసిక స్థితి  మెరుగుపడటానికి, నిరాశను తగ్గించుకోవడానికి  ఎంతగానో సాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా  మన శరీరంలోకి ప్రవేశించే హానికర వైరస్ ను నాశనం చేసి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.


సీతాఫలం చెట్టు యొక్క బెరడు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ బెరడును డికాక్షన్ గా చేసుకుని తాగడం వల్ల మంట మలబద్దకం తగ్గుతుంది. ఇక సీతాఫలం విత్తనాలను పొడిచేసి తలకు పట్టించడం వల్ల తలలో పేలు, ఈపులు తొలగిపోతాయి. అయితే ఈ పొడి కళ్ళల్లోకి పడకుండా చూసుకోవాలి. ఈ ఆకులను పేస్ట్ చేసి,గజ్జి, తామర వంటి చర్మ సమస్యలపై పై పూతలా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం సీతాఫలం తక్కువ మొత్తంలో విష సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: