ప్రోబయోటిక్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!

Divya

ప్రోబయోటిక్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS). ప్రోబయోటిక్స్ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది  . సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్ మన శరీరానికి అందాలంటే మాత్రం మన ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. కడుపులో అల్సర్లు, మంటలు అలాగే లూజ్ మోషన్స్,డయేరియా వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లకి ప్రోబయోటిక్స్ ను పెంచుకోవడం  వల్ల ఈ జబ్బులు త్వరగా తగ్గుతాయి.

సాధారణంగా ప్రోబయోటిక్స్ శరీరానికి రోగనిరోధక శక్తి లాగా పనిచేస్తుంది . ఇది పేగులలో మంచి బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. మంచి బ్యాక్టీరియా ప్రేగుల గోడల చుట్టూ పెరగడం వల్ల, మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే,  అంత తక్కువ మోతాదులో మనం జబ్బుల బారిన పడవచ్చు. సాధారణంగా ఈ బ్యాక్టీరియా చిన్న ప్రేగు గోడలమీద, పెద్దప్రేగు, మలం ప్రేగు గోడల పై పొరలో ఉంటాయి.  ఈ ప్రోబయోటిక్స్ వల్ల వచ్చే బ్యాక్టీరియా, మన శరీరంలో ప్రవేశించే హానికర బ్యాక్టీరియా ను నాశనం చేస్తుంది.


ఈ మంచి బ్యాక్టీరియా పేగులలో కదులుతూ విటమిన్ బి12 ని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ బి 12 శరీరానికి ఎంత ఉపయోగమో మనందరికీ తెలుసు. శరీరంలో ఎప్పుడైతే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను విడుదల చేయడం తగ్గిస్తుందో, అప్పుడు మన శరీరంలో విటమిన్ బి12 లోపం వస్తుంది. ఇక శరీరంలో ఉన్న రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కె అవసరమవుతుంది.  ఇక ఈ విటమిన్ కె కూడా ప్రేగులలో తయారవుతుంది. ఇక ఎప్పుడైతే మన శరీరంలో వైరస్లు,ఫంగస్ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయో,అప్పుడు రక్తంలో ఈ చెడు బ్యాక్టీరియా  కలవకుండా,ఈ మంచి బ్యాక్టీరియా అడ్డుకుంటుంది.


మనం తినే ఆహారంలో ప్రోబయోటిక్స్ ఎందుకు తగ్గిపోతుంది అంటే, మనం తింటున్న ఆహారం పురుగు మందులు,ఎరువులు వాడే పండించింది కాబట్టి. కావున ఇలాంటి మందుల వల్ల మన శరీరంలో సహజంగా ఏర్పడే ప్రోబయోటిక్స్ నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా ప్రేగుల పైన అల్సర్లు పుండ్లు ఏర్పడతాయి.  సహజంగా మన శరీరంలో ప్రోబయోటిక్స్ విలువలను ఎలా పెంచుకోవాలి అంటే.. పుల్ల బెట్టిన గంజి, ఒక అరటిపండు బీన్స్ నట్స్ మొలకలు తినటం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి ప్రేగుల పై ఉంటుందని ఒక పరిశోధన ద్వారా తెలిపింది. కాబట్టి మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మలబద్దకం తగ్గి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: