మునగ తో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మునగ సర్వరోగ నివారిని. అది ఏమనగా ఎన్నో రకాల సమస్యలను దూరం చేయడంలో మొదటి పాత్ర వహిస్తుంది. విటమిన్ల లోపం, ఆర్థరైటిస్ సమస్యలకు ఉపయోగపడుతుంది. అంతేకాక దాదాపు మూడు వందల వ్యాధులకు పైగా నయం చేయగల శక్తి మునగ కు ఉంది. అందుకే మునగ చెట్టును "మిరాకిల్ ట్రీ" అని కూడా పిలుస్తారు. అయితే మునగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మునగ చెట్టు లో మునగాకు, మునగ కాయలు వినియోగించి, జుట్టురాలడాన్ని, చర్మం పైన మొటిమలు,శరీరంలో రక్తహీనత, విటమిన్ డి లోపం వంటి ఎన్నో సమస్యలను అరికడుతుంది. వీటిలో చాలా రకాల ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి.అవి విటమిన్ ఏ,విటమిన్ బి1 (థయామిన్), రిబోఫ్లేవిన్,నియాసిన్, విటమిన్ బి 6, ఫోలేట్,విటమిన్ సి,కాల్షియం,పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మొదలైనవి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్,యాంటీ గేజింగ్ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఇక మునగ కాయలు కానీ, మునగ ఆకులు కానీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని హీమోగ్లోబిన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు తగ్గించి, గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే అధిక కొవ్వును కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక కాలేయం, మూత్ర పిండాలను శుభ్రం చేయడంలో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో మునగాకుకి మించిన ఔషధం మరొకటి లేదు.
అలాగే చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు కూడా తగ్గడానికి ఈ మునగ చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో అధిక కొవ్వు శాతాన్ని తగ్గించడం వల్ల బరువు కూడా తొందరగా తగ్గుతారు. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇక డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మన ఆహారంలో తీసుకోవడం వల్ల, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన ను తగ్గిస్తుంది. మహిళల్లో ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు వారు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే బాలింతలలో తల్లి పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఏమనగా మన ఆహారం లో చేర్చుకొని రోగాల బారిన పడకుండా ఉండవచ్చు.