కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం...!
బంగాళాదుంపలు, బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే ముందుగా నాకు బాగా వేడి చేసిన తర్వాత నూనె వెయ్యాలి.
పచ్చికాయలు తొందరగా పండాలంటే కాయలను పేపర్ లో చుట్టి బియ్యం డబ్బాలో గాని,వెచ్చగా ఉండే ప్రదేశం లో గాని పెట్టాలి.
జిలేబి పిండిలో ఒక స్పూన్ వంట సోడా కలపడం వల్ల జిలేబి చుట్టలు ఉబ్బినట్టుగా ఉండడమే కాకుండా విరిగి పోకుండా ఉంటాయి.
పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పులను నిల్వ ఉంచే డబ్బాలో అడుగు భాగాన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
తేనెకు చీమలు పట్టకుండా ఉండడానికి తేనెలో నాలుగు మిరియాల గింజలను వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
అరటి చిప్స్ వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయించితే కరకరలాడతాయి.
పచ్చి బఠానీలు నిల్వ ఉండాలంటే పాలిథిన్ సంచుల్లో వేసి డీ ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది.
ఆకుకూరల్ని కడిగేటప్పుడు ఆనీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు చనిపోతాయి.
వంటింట్లో గట్టును పసుపు నీళ్ళతో శుభ్రం చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి.
కోడిగుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉండడానికి ఆ నీటిలో కొంచెం ఉప్పు వేయండి.
మాంసాహారం ఉండేటప్పుడు త్వరగా ఉడకాలంటే అందులోకి నాలుగు బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.
బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తర్వాత కొద్దిగా నెయ్యి కలిపితే బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది.
పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండడానికి గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.
పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు లోకి చిన్న కొబ్బరి ముక్క వేస్తే సరిపోతుంది.