కర్పూరం లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, మీకు తెలుసా...?

kalpana
కర్పూరాన్ని పూజా సమయములో హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. అన్ని శుభకార్యాల్లోనూ కర్పూరాన్ని కచ్చితంగా వాడతాము.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.కర్పూరం వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. కర్పూరమును పూజకు మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఉపయోగిస్తాము.తలనొప్పి, దగ్గు వంటి వాటికి కూడా ఉపయోగిస్తాము.కర్పూరాన్ని  పరిమితికి మించి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం...               
 అనేక వ్యాధులను నయం చేయడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. జ్వరము, కోరింత దగ్గు,ఆస్తమా, మానసిక వ్యాధులకు,క్యాన్సర్, మూత్రకోశ సమస్యలను నయం చేయడానికి కర్పూరాన్ని వాడుతారు.
మొటిమలు నివారించడానికి కర్పూరం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎలా వాడాలి అంటే ఒక స్పూన్ కర్పూరం నూనె,ఒక స్పూన్ కొబ్బరి నూనె లో మిక్స్ చేసి మొటిమలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 ముక్కు దిబ్బడతో  బాధపడుతున్నప్పుడు కొద్దిగా కర్పూరం నూనె తీసుకొని, అందులోకి కొద్దిగా గోరువెచ్చని ఆవనూనె కలిపి ముక్కు దగ్గర, చాతి మీద అప్లై చేయాలి.ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. అలా అని ఎక్కువ ఉపయోగించకూడదు. ఎక్కువ మోతాదులోనూ ఉపయోగించాలి.
 పేలా సమస్యల్లో బాధపడుతున్నప్పుడు కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం నూనె వేసి తలకు అప్లై చేయండి. చేయడంవల్ల పేల సమస్య తగ్గుతుంది.
 తేలు కుట్టిన వాళ్లకి కొద్దిగా కర్పూరం తీసుకొని అర గ్రామం యాపిల్ రసం లో కలిపి అరగంటకొకసారి తాగించడం వల్ల తేలు విషం చెమట రూపంలోనూ, మూత్ర రూపంలో బయటకు వస్తుంది.
 దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెట్టడం వల్ల దోమలు బయటికి పారిపోతాయి.అలాగే గుప్పెడు పాపులు, కొద్దిగా కర్పూరం వేసి నీళ్లలో మరిగించి ఆ నీటితో ఫ్లోర్ తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: