ఏ ఏ ఆహార పదర్థాలలో కాల్సియం పుష్కళంగా లభిస్తుందో తెలుసా?

Divya

కాల్షియం మన శరీరంలో ఎముకల దృఢత్వానికి,పళ్ళు పటిష్టంగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. కానీ ఆ కాల్షియం మన శరీరానికి ఏ విధంగా లభిస్తుందో మాత్రం చాలామందికి తెలియదు. క్యాల్షియం కేవలం ఎముకలకు, పళ్లకు మాత్రమే కాకుండా శరీరంలో ఎన్నో రోగాలను అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ప్రత్యేకంగా ఏ ఏ  ఆహార పదార్థాలలో ఏ విధంగా మనకు లభిస్తుందో ఇక్కడ  ఇప్పుడు చూద్దాం.

క్యాల్షియం మన శరీరంలో కండరాలు, నాడులు,కణాలు సరిగ్గా  పనిచేసేలా చేస్తుంది.అంతేకాకుండా రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ఎక్కువగా పాలలో ఉంటుంది.పాలతోపాటు  పాలతో తయారైన పదార్థాలలో  ల్యాక్టోజ్ పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో క్యాల్షియం పెరిగేలా చేస్తుంది. ఎండిన అంజూర పండ్లు తినడం వల్ల వాటి నుండి 121 మిల్లీగ్రాముల కాల్షియం మన శరీరానికి లభిస్తుంది.ఇందులో పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కండరాల పని తీరును,గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఇక నారింజ పండులో 74 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అంతేకాకుండా వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. చేపలను  120 గ్రాములు చొప్పున తీసుకుంటే అందులో 351 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి 12,విటమిన్ డి కూడా లభిస్తుంది.బెండకాయకు మలబద్దకాన్ని నివారించే పీచుతో నిండిన కాయ కూర. బెండకాయలను ఒక కప్పు తీసుకుంటే 82 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అంతేకాకుండా వీటిలో పోలేట్,విటమిన్ బి6, విటమిన్ డి లు ఉన్నాయి.

బాదం పప్పుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. అయితే 30 గ్రాముల బాదం పప్పులలో  75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తింటేనే అంత స్థాయిలో క్యాల్షియం లభిస్తుంది.అంతేకాకుండా విటమిన్ ఈ, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: