గ్రీన్ టీ వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకి రెండు సార్లు అంటే.. ఉదయం పూట సాయంత్రం పూట గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.ఇప్పుడు గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం...గ్రీన్ టీ లో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తిని బలంగా చేసి సీజనల్ ఫ్లూ, జలుబు వంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తాయి.చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నా గ్రీన్ టీ తాగడం వల్ల ఫలితం ఉంటుందని ఎన్నో పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.గ్రీన్ టీ వల్ల జరిగే డీ టాక్సిఫికేషన్ వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఫలితం గా చర్మం ఆరోగ్యం గా, తేమగా, అవసరమైన పోషణతో కళకళలాడుతూ మెరుస్తూ ఉంటుంది.ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే మసాలా గ్రీన్ టీ తయారు చేసుకోండి..మసాలా గ్రీన్ టీలో గ్రీన్ టీ ఆకులే కాక దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు వంటి మసాలాలు కూడా ఉంటాయి.

ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ జెస్ట్ కలిపితే మీరు ఈ పానీయానికి సీజనల్ ఫ్లేవర్ ని కూడా యాడ్ చేయవచ్చు.ఈ టీలో కలిపే మసాలా దినుసుల వల్ల ఈ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరి కొంత పెరుగుతాయి. ఇందులో వాడే ప్రతి ఒక్క మసాలా కీ దానికే ప్రత్యేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఈ టీ వింటర్ లో ఇమ్యూనిటీ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ మసాలా గ్రీన్ టీ బాగా రుచిగా ఉంటుంది కూడా. ఇందులో వాడే మసాలా దినుసులు అన్నీ ఈ శీతా కాలం లో లోపలి నుండి వెచ్చదనాన్నిస్తాయి.

ఈ పానీయం చక్కని నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అవుతుంది, అంతే మాక్ టెయిల్ అవుతుంది. సాంగ్రియా, మల్డ్ వైన్ వంటి వెచ్చని కాక్ టెయిల్స్ ఇష్టపడని వారికి ఈ పానీయం ఇవ్వవచ్చు.ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం ఈ రోజుల్లో తప్పనిసరి. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: