పరగడుపున తినకూడని పదార్థాలు ఏంటో తెలుసా?

Divya

ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే రోజంతా పని చేయలేము. అలాగని శక్తి కోసం ఏదో ఒకటి తినేస్తుంటారు. ఒకవేళ ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం పాటూ అధిక బరువుకు దారితీస్తుంది.అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆకలి పైన ధ్యాస పెరిగి,  మరే ఇతర పనుల పైన ధ్యాస వుండదు. అంతేకాకుండా మొదటి పనితీరు కూడా  దెబ్బతింటుంది. అంతేకాక కడుపులో గ్యాస్ ఫామ్ అయి, అసిడిటీ ఏర్పడుతుంది.

అయితే ఉదయం తీసుకొనే అల్పాహారం కూడా పౌష్టిక ఆహారాన్ని కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే అల్పాహారంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఉదయాన్నే అల్పాహారంగా నారింజ, నిమ్మ  లాంటి సిట్రస్ జాతి పండ్లు తీసుకోకూడదు.ఒకవేళ ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఎదురవుతాయి. "అరటి పండు "ను ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటుంటారు.చాలామంది అరటి పండులో విటమిన్స్,ప్రోటీన్ కలిగి ఉంటాయని, అరటి పండును తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు అన్న నెపంతో అల్పాహారంగా అరటిపండును తీసుకుంటుంటారు. పరగడుపున అరటిపండును తినడం వల్ల వాంతులు, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

టొమాటోలను కూడా అల్పాహారంగా తీసుకోకూడదు. టొమాటో కూడా సిట్రస్ జాతికి చెందిన పండు. కాబట్టి కడుపులో అసిడిటీ వచ్చే ప్రమాదం ఎక్కువ.  అంతేకాకుండా ఉదయాన్నే సలాడ్స్ వంటివి కూడా తీసుకోకూడదు.పరగడుపున సలాడ్స్ త్రాగడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి, గుండెల్లో మంట కూడా వస్తుంది.

అయితే నిత్యం ఉదయాన్నే అల్పాహారంగా జొన్న రొట్టె, రాగి ముద్ద, కూరగాయలు, పండ్ల ముక్కలు, ఆకుకూరలు వంటివి అల్పాహారంగా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం జీర్ణక్రియ పైన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఉదయాన్నే తీసుకొనే ఆహారం సరైనది పెంచుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది. చాలా మంది ఉదయాన్నే అల్పాహారాన్ని తినకుండా ఉంటారు. అలా తినకపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్,డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందుచేత ఉదయాన్నే అల్పాహారాన్ని సరైన విధంగా ఎంచుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: