శీతాకాలంలో పసుపు టీ తాగితే కలిగే బెనిఫిట్స్ తెలుసుకోండి...
ఈ చలి కాలంలో పసుపు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పసుపు టీ బరువు తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యం ఉంచుతుంది కూడా. అంతేకాదు.. పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. పసుపులోని కుర్కమిన్ ట్యూమర్ల పెరుగుదలను అరికడుతుంది. క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది. పసుపు టీ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు, ఒబేసిటీతో పోరాడేందుకు కూడా సహకరిస్తుంది.డయాబెటిస్‌ను అడ్డుకోవడంలోనూ పసుపు టీ సహాయ పడుతుందని తేలింది. పసుపు టీలోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఆర్థరైటీస్ బారిన పడకుండా కాపడతాయి. కాబట్టి రోజు పసుపు టీ ని అలవాటు చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...