మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి.

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఒక మనిషి జీవితం సంతోషంగా సాగాలంటే అతనికి మంచి ఆరోగ్యం ఉంటే సరిపోదు. మనసు ప్రశాంతంగా కూడా ఉండాలి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఇక మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులను మీ జీవితంలో అలవాటు చేసుకోండి.
ఒక జర్నల్ లేదా డైరీ లో ప్రతి రోజూ మీరు కృతజ్ఞతగా ఫీల్ అయిన మూడు విషయాలు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసిన మూడు విషయాల గురించి రాయండి. ఇది ఫిజికల్ హెల్త్ కి కూడా ఎంతో హెల్ప్ చేస్తుందని అంటారు.
పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగండి. కాఫీ మంచి మూడ్ లో ఉంచుతుంది. మీకు కాఫీ అలవాటు లేకపోతే గ్రీన్ టీ తాగండి.
వెకేషన్ ప్లాన్ చేసుకోండి. లేదా ఫ్యామిలీ అందరూ కలిసే ఒక గెట్-టుగెదర్ ప్లాన్ చేయండి. ఇలాంటి యాక్టివిటీస్ బ్రెయిన్ ని చురుగ్గా ఉంచుతాయి.
మీకు బాగా నచ్చిన, వచ్చిన పనులకి ఇంకా మెరుగు పెట్టుకోండి. ఒక్కొక్క లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి.
మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా ఉండాలి మీరు నిద్ర పోయే రూం అలా ఎరేంజ్ చేసుకోండి.
లైఫ్ లో మీ నెక్స్ట్ గోల్ ఏమిటో ఆలోచించుకుని దానికి తగిన స్టెప్స్ తీసుకోండి.
 
ఎక్స్పెరిమెంట్స్ చేయండి. కొత్త వంటకం ట్రై చేయడం, ఒక కవిత రాయడం, ఒక బొమ్మ గీయడం, పెయింటింగ్ నేర్చుకోవడం వంటివి మెంటల్ హెల్త్ కి ఎంతో హెల్ప్ చేస్తాయి.
మీ లైఫ్ లో మీకు బాగా దగ్గరైన వాళ్ళకి మీ ప్రేమని, ఇష్టాన్ని తెలియచేస్తూ ఉండండి. వారి మీద మీకున్న అభిమానం వారికి తెలియడం కూడా అవసరమే.
మీ బాధని మీలోనే దాచుకోకండి. మీరు నమ్మే వ్యక్తితో పంచుకోండి. లేదు, పేపర్ మీద రాసి ఆ పేపర్ ని ముక్కలు చేసేయండి.
మీకు బాగా నచ్చే యాక్టివిటీస్ లో టైమ్ స్పెండ్ చేయండి. లైఫ్ లో అంతా పాజిటివ్ గా ఎవరికీ ఉండదు, మనం పాజిటివ్ వైపు ఫోకస్ చేస్తామంతే.
మనసులో ఆందోళనగా ఉందా? కలరింగ్ బుక్ తీసుకుని రంగులు వేయండి. కాంప్లికేటెడ్ డిసైన్స్ అయితే మరీ మంచిది. మీ దగ్గర కలరింగ్ బుక్ లేకపోతే ముగ్గులు వేయండి, చిన్నప్పుడు కాగితం తో చేసే ఎలకలూ, పడవలూ ఎలా చేశారో గుర్తు తెచ్చుకుని మళ్ళీ అలాంటివి చేయండి.
హాయిగా నవ్వండి. ఫ్రెండ్స్ తో కలిసి నవ్వుకోండి, ఫ్యామిలీ తో కలిసి ఫన్నీ గా ఉండే మూవీ ఎంజాయ్ చేయండి. ఒక్కరే కూర్చుని జోక్స్ చదువుకుంటూ నవ్వుకోండి. విట్టీగా ఉండే పుస్తకాలు మీ దగ్గర ఉంటే యాంగ్జైటీ మీ దగ్గరకి కూడా రాలేదు.
ఒక రోజంతా మీ ఫోన్ ని మర్చిపోయి బయట తిరిగి రండి. ఎంత హాయిగా ఉంటుందో మీరే చూడండి.
అప్పుడప్పుడూ డార్క్ చాక్లేట్ తినండి. బ్రెయిన్ కి అది మంచి ఫుడ్.
ఇంట్లో డాన్స్ చేయండి. పనులు చేసుకుంటూ డాన్స్ చేయండి. పనులు తేలిగ్గా అయిపోతాయి. మీకూ హాయిగా ఉంటుంది.
సూర్యోదయాన్ని ఆస్వాదించండి. ఆ బూస్ట్ ఇంకేదీ ఇవ్వలేదు. అలాగే పౌర్ణమి నాటి నిండు చంద్రుణ్ణి, చల్లని వెన్నెలని ఎంజాయ్ చేయండి. ఆ ప్రశాంతతే వేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: