రోగనిరోధక శక్తి పెరిగేందుకు తీసుకోవాల్సిన అహార పదార్థాలివే..?

Reddy P Rajasekhar

భారతదేశాన్ని కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎవరైతే రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారో వారు కరోనాను సులభంగా జయిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా కరోనా భారీన పడినా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 
 
రోజూ పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే రోగనీరోధక శక్తి పెరుగుతుంది. పాలలోని కాల్షియం, బెల్లంలో ఐరన్ శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తాయి. బెల్లంలో సుక్రోజ్, గ్లూకోజ్, ఖనిజాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. బెల్లం జీర్ణాశయ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. పొట్టలో గ్యాస్ ఉత్పత్తి జరగకుండా సహాయపడుతుంది. 
 
పాలల్లో విటమిన్ ఏ, బీ, డీలతో పాటు కాల్షియం, ప్రోటీన్స్, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రోజూ రాత్రి సమయంలో చిన్న బెల్లం ముక్క వేసిన పాలు తీసుకుంటే హాయిగా నిద్ర పట్టడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా ఆస్తమా సమస్యతో బాధ పడేవారు శీతాకాలం, వర్షాకాలంలో ఇబ్బందులు పడతారు. 
 
 
ఆస్తమాతో బాధ పడేవారు బయటకు వెళ్లే ముందు బెల్లం కలిపిన పాలు తీసుకుంటే సమస్య తగ్గుముఖం, పడుతుంది. నల్ల నువ్వుల్లో బెల్లం వేసి తయారు చేసిన లడ్డూల్జు తిన్నా శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది. కరోనా ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి, ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేరు. ముందస్తు చర్యలు తీసుకుంటే కరోనా భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకొవచ్చు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏపీలో ఈరోజు 81 కేసులు నమోదు కావడంతో 1097కు చేరింది. తెలంగాణలో నిన్నటివరకు 990 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: