ఉల్లి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా....?

Reddy P Rajasekhar

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. మనం తినే ఆహారంలో ఉల్లిగడ్డలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన శరీరానికి ఉల్లి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. 5 సంవత్సరాల వయస్సు పై బడిన పిల్లలను నిద్రపుచ్చాలంటే ఉల్లిపాయ పొట్టును తీసి దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తరువాత నీటిని మాత్రమే తీసుకొని ఆ నీటికి రెండు చంచాల చక్కెర చేర్చి ఇస్తే పిల్లలకు మంచి నిద్ర వస్తుంది. 
 
కొందరు చిన్నారులు తరచుగా చెవినొప్పి అని చెబుతూ ఉంటారు. ఉల్లిపాయ రసాన్ని వేడి చేసి ఆ తరువాత చల్లార్చి చెవిలో పోస్తే చెవినొప్పి తగ్గుతుంది. అజీర్తితో ఎక్కువగా బాధ పడేవారికి వాంతులు, విరేచనాలు అవుతూ ఉంటాయి. గోరువెచ్చని నీటికి అరకప్పు ఉల్లిపాయ రసం కలుపుకుని తాగితే విరేచనాలు, వాంతులు తగ్గుతాయి. ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తే ముక్కు నుండి రక్తం కారుతుంటే వెంటనే రక్తం కారడం ఆగుతుంది. 
 
పుచ్చు పళ్ల నొప్పితో బాధ పడుతుంటే వంటనూనె, ఉల్లిపాయ రసాన్ని కలిపి ఆ రసాన్ని పుచ్చు పళ్లు ఉన్నదగ్గర పోస్తే వెంటనే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉల్లి ఆస్తమా రాకుండా నివారించడంతో పాటు రక్తపోటును, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. ఉల్లి కళ్లకు మంచి టానిక్ లా పని చేయడంతో పాటు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను తగ్గించటంతో ఉల్లి ఎంతో సహాయపడుతుంది. ఉల్లి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం ఉల్లి తినకుండా ఉండలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: