స్త్రీ జాతికి గర్వకారణం కల్పనా చావ్లా జయంతి నేడు!

Purushottham Vinay
భారత స్త్రీలకు పెద్దగా ప్రోత్సాహంలేని కాలంలో పుట్టిందామె. పెద్ద పెద్ద కండలు తిరిగిన మగవాళ్ళు కూడా చిన్నబోయేలా అంతరిక్షంలో అడుగుపెట్టి ప్రపంచ మహిళాలోకం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఆమె కల్పనా చావ్లా. ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఆమె సాధించిన కీర్తి మాత్రం ఎన్నటికీ చెరిగిపోనిది.నేడు ఈ వీర వనిత పుట్టినరోజు.కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రం కర్నల్ లో 1962 వ సంవత్సరంలో జన్మించారు. ఠాగూర్ స్థాపించిన బాలనికేతన్ స్కూల్ లో తన సెకండరీ స్థాయి విద్యను పూర్తిచేసుకున్నారు. ఆమె తన చిన్న తనం నుంచి తండ్రితో తరచుగా బయటకు వెళుతూ ఉండేవారు.అందులో భాగంగా కర్నల్ లో ఉన్న లోకల్ క్లబ్ లకు వెళ్లి అక్కడ తండ్రితో కలసి ఎరోప్లేన్ లను చూసేవారు. ఆమె అలా విమానం రెక్కల్ని తన మనసుకు తొడుక్కున్నారు. 


పంజాబ్ ఇంజనీర్ కాలేజి నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తరువాత 1982వ సంవత్సరంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేయడానికి టెక్సాస్ యూనివర్సిటీలో సీటు కోసం అమెరికా వెళ్లారు. దీని తరువాత NASA's Ames Research Center లో చేరి అక్కడ పనిచేస్తూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డి పూర్తిచేశారు.అలా పురోగతి సాధించిన కల్పన వ్యోమగామిగా 1997, నవంబర్ 19వ తేదీన మొదటిసారిగా STS-87 మిషన్ లో భాగంగా కొంతమంది వ్యోమగాములతో కలసి అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. అయితే 2003 జనవరి 16వ తేదీన STS-107 మిషన్ లో భాగంగా మళ్ళీ అంతరిక్షరానికి వెళ్లారు. అయితే అలా వెళ్ళిన కల్పన గారు మళ్ళీ భూమిని చేరలేదు.పేలుడు సంభవించి ఆకాశమార్గంలోనే ఆమె వీర మరణం పొందారు. కానీ కల్పనా చావ్లా గారి కీర్తి మాత్రం చరిత్రలో అలా మిగిలిపోయింది.సమాజంలో ఇంట్లోనే అణచివేయబడ్డ స్త్రీలకు కల్పనా గర్వ కారణం. ఆమె మరణం ఓ చరిత్ర. ఆమె జీవితం ఎందరో స్త్రీలకు ఆదర్శం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: