మార్చి 17: ప్రపంచ నిద్ర దినోత్సవం!

Purushottham Vinay
నిద్ర అనేది మన శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రశాంత స్థితి.కేవలం మానవులకే కాక జంతువులు..పక్షులు ఇంకా ఇలా ప్రతీ ప్రాణికి నిద్ర చాలా అవసరం. ప్రతీప్రాణి కూడా తాను బ్రతకటానికి నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మానవుల జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం.శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనది.నిద్ర ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కు.ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరమైనది.ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవం..ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు జరుపబడుతోంది.ఇక వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ (వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్)ఆధ్వర్యంలో 2008 వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపడం, నిద్ర సమస్యల భారం అలాగే వైద్య, విద్యా, సామాజిక అంశాలపై సమాజం దృష్టిని ఆకర్షించడం, నిద్ర రుగ్మతల నివారణ ఇంకా అలాగే నిర్వహణను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.నిద్ర అనేది జీవితంలో చాలా సాధారణ అంశం.

ఇది ప్రజల జీవితంలో అత్యంత సామాన్యమైన, తక్కువగా అంచనా వేయబడిన అంశాలలో ఒకటి. కానీ ప్రస్తుత రోజుల్లో నిద్ర సమస్యలు ఉన్నవారు ఎక్కువవుతున్నారు. ఈరోజుల్లో తగినంత నిద్ర పొందడం అనేది నిజమైన సవాలు. నిద్ర జీవితంలోని అన్నింటిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని నిద్ర సమస్యలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకోని వారికి నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు.అమెరికన్ స్లీప్ అసోసియేషన్ ప్రకారం, 50 నుండి 70 మిలియన్లకు పైగా ప్రజలు కొన్ని రకాల స్లీపింగ్ డిజార్డర్‌ను కలిగి ఉన్నారు.25 మిలియన్లకు పైగా స్లీప్ అప్నియా కలిగి ఉన్నారు.పిల్లలు అలసిపోయినప్పుడు సహజంగా నిద్రపోతారు, పెద్దలు కూడా అలాగే నిద్ర పోతారు. కానీ ఈ రోజుల్లో మాత్రం ప్రశాంతంగా నిద్ర పోలేరు.మనం మన శరీరాన్ని జాగ్రత్తగా అందంగా చూసుకున్నట్లే నిద్ర దినచర్యకు కూడా ఖచ్చితంగా అదనపు శ్రద్ధని చూపించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: