వీర భద్ర దేవాలయం గురించి తెలుసుకుందాం రండి ..!

Divya
భారతదేశం హిందూ శాస్త్రంతో పాటు ఎన్నో కళలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో పురాతన నిర్మితాలు, ఎప్పుడు..? ఏ సందర్భంలో..? ఏం జరిగిందో..? భవిష్యత్ తరాల వారికి కూడా ఎప్పటికప్పుడు సరికొత్త విద్యను నేర్పిస్తూ ఉంటుంది . అందుకే భారతదేశంలో జన్మించడం అంటే పూర్వజన్మ సుకృతం అని అంటూ ఉంటారు. ముఖ్యంగా భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డ పురాతన కట్టడాలకు అలాగే నిర్మాణాలకు ఒక్కో మందిరం ,ఒక్కో ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంది. అందుకే ఈ రోజుకి కూడా మనం ఒక్కో దేవాలయం గురించి కూడా తెలుసుకుని వాటిని సందర్శించడానికి వెళుతూ ఉంటాము. ఇకపోతే ఆనాటి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరభద్ర దేవాలయం గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి.

ఈ దేవాలయం ఎక్కడ ఉంది..? ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారు..? దీని యొక్క విశిష్టత ఏమిటి..? అనే పూర్తి విషయాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో ఈ గుడి నిర్మించడం జరిగింది. క్రీస్తుశకం 1730 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లు అక్కడ ఉన్న ఆధారాల ద్వారా చరిత్ర చెబుతోంది. ఇక ఈ గుడిని మొత్తం 70 స్తంభాలతో నిర్మించారు. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వ్రేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూడటానికి వివిధ దేశాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు. అంత బరువు గల ఒక స్తంభం ఎలా గాలిలో వ్రేలాడుతోందో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.

అంతేకాదు ఈ స్తంభం గుడి మధ్యలో నిర్మించటం వల్ల బ్రిటిష్ రాజులు ఈ స్తంభాన్ని తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడు, కొద్దిగా స్తంభాలు కూడా కదలడం ప్రారంభించాయట. కేవలం ఈ ఒక్క స్తంభంపైన గుడి నిర్మాణం మొత్తం ఆధారపడి ఉందని తెలుసుకున్న బ్రిటిష్ రాజులు కదపకుండా వదిలేశారు. ఇప్పటికీ ఈ గుడి కొంచెం ఒరిగినట్లు ఉండడం మనం గమనించవచ్చు.

ఇక మరొకసారి 1910వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభం ఎలా గాలిలో వ్రేలాడుతోందో తెలియక, ఎలాగైనా సరే ఈ స్తంభం కింద ఉన్న ఖాళీని భర్తీ చేయాలని అనుకున్నాడు. అప్పుడు కూడా ఈ ఆలయం బీటలు భారడం  గమనించి , ఇక ఈ పనిని మానుకున్నాడు. ఈ బ్రిటిష్ ఇంజనీర్  ఈ స్తంభంపై ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ రహస్యాన్ని మాత్రం చేధించలేక పోయాడు. ఇక ఇదే ఆలయంలో ఒక పెద్ద పాదం ముద్ర కూడా ఉంది. ఇది సుమారుగా 3 అడుగులు వుంటుంది. ఈ పాద ముద్ర ఎవరిది ..?  అనే రహస్యం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: