జులై 16: చరిత్రలో ఈ రోజు జరిగిన గొప్ప సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. ఇక 0622 వ సంవత్సరంలో ఈ రోజు అనేది ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు.ఇక దీనినే హిజ్రీ శకం అని కూడా అంటారు.1439 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించడం జరిగింది.1661వ సంవత్సరంలో బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేయడం జరిగింది.1880 వ సంవత్సరంలో డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళగా ఎంపికయ్యింది.1862 వ సంవత్సరంలో లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.1918 వ సంవత్సరంలో నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీయడం జరిగింది.1926 వ సంవత్సరంలో నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో  మొదటిసారిగా నీటి లోపల తీసిన కలర్ ఫొటో  ప్రచురించబడటం జరిగింది.1936 వ సంవత్సరంలో రక్తప్రసరణ మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీయడం జరిగింది.

1941వ సంవత్సరంలో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి సీట్టెల్ నగరంలో నమోదు అవ్వడం జరిగింది.1945 వ సంవత్సరంలో "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును ప్రయోగాత్మకంగా ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ పరీక్షించడం జరిగింది. ఇక అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించడం జరిగాయి. ఇక దాని ఫలితంగా ఒక మైలు వ్యాసార్ధంలో ఉన్న జీవజాతులన్నీ మరణించడం జరిగాయి. ఇక ఈ రోజు నుంచి "అణు యుగం" అనేది ప్రారంభమవ్వడం జరిగింది. ఈ అణుబాంబు తయారీ ప్రయోగం అంతటికి కూడా "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టడం జరిగింది.1945 వ సంవత్సరంలో మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్ ఇంకా జోసెఫ్ స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమవ్వడం జరిగింది.1965 వ సంవత్సరంలో 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం ప్రారంభమయ్యింది.ఇదొక ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: