జూన్ 19వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి ఏడాదిలో ఉండే ఎన్నో తేదీల‌కు ఎన్నో విశేషాలు, వింత‌లు క‌లిగి ఉంటాయి. కాగా ఆయా తేదీల్లో ఎన్నో ర‌కాల ప్ర‌ముఖ‌మైన చ‌రిత్ర‌ల‌కు అద్దంలా నిలుస్తాయి. ఇక ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన స‌న్నివేశం జ‌రిగి ఉంటుంది. ఇక అలాంటి డేట్ల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే చరిత్ర‌లో ఈరోజు జూన్ 19కి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
♥ జననాలు ♥
✦  1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన గొప్ప సైంటిస్ట్, ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త, రచయిత, కాథలిక్ వేదాంతవేత్త. (మ.1662)
✦ 1928: భద్రిరాజు కృష్ణమూర్తి, పండితులు, ద్రావిడ భాషాశాస్త్ర పరిశోధకులు, భాషను స్టడీ చేసి, టీచ్ చేసే సత్తా గల అధ్యాపకులు. (మ.2012)
✦ 1939: నూతలపాటి సాంబయ్య, నటుడు, దర్శకుడు, న్యాయనిర్ణేత, విశ్లేషకుడు, నాటకరంగ నిపుణులు.
✦ 1962: ఆశిష్ విద్యార్థి, భారతీయ సినీ నటుడు.
✦ 1964: బోరిస్ జాన్సన్, బ్రిటిష్ రాజకీయవేత్త, రచయిత, యునైటెడ్ కింగ్‌డమ్ కి ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జూలై 2019 నుంచి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నారు.
✦ 1970: రాహుల్ గాంధీ, భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ లకు చైర్ పర్సన్.
✦ 1985: కాజల్ అగర్వాల్, ఇండియన్ మూవీ యాక్టర్. తమిళ్, తెలుగు, హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు.
✦ 1983: బెంజమిన్ హమ్మండ్ హాగర్టీ, స్టేజ్ నేమ్ మాక్లెమోర్, అమెరికన్ రాపర్, పాటల రచయిత.
♡ మరణాలు ♡

✦ 1949: సయ్యద్ జఫారుల్ హసన్, భారతీయ తత్వవేత్త, విద్యావేత్త (జ .1885)
✦ 1993 - విలియం గోల్డింగ్, బ్రిటిష్ నవలా రచయిత, నాటక రచయిత, కవి, నోబెల్ బహుమతి గ్రహీత (జ .1911)
✦ 2008 - బారున్ సేన్‌గుప్తా, బెంగాలీ జర్నలిస్ట్, భర్తమాన్ పత్రికా స్థాపకులు (జ .1934)
✦ 2001: జంధ్యాల, (అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి), ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, డైలాగ్ రైటర్. (జ.1951)
2018: నేరెళ్ళ వేణుమాధవ్, సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు, ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుదాంకితుడు, పద్మశ్రీ పురస్కారగ్రహీత (జ.1932)
2019: డి.కె.చౌట, ఇండియన్ బిజినెస్ మ్యాన్, రైటర్, ఆర్టిస్ట్, రంగస్థల నటుడు. (జ.1938)
✷ పండుగలు, జాతీయ దినాలు ✷
✦  ప్రపంచ సికిల్ సెల్ డే ( కణ రక్తహీనత)

✷ సంఘటనలు ✷
✦ 1953: జూలియస్ రోసెన్‌బర్గ్(35), అతని భార్య ఎథెల్ (37) సోవియట్ యూనియన్‌కు యూఎస్ అణు రహస్యాలు చెబుతున్నారని తెలిసి వారిని న్యూయార్క్‌లోని ఒస్సైనింగ్‌లోని సింగ్ సింగ్ జైలులో ఉరితీసారు.
✦ 1961: కువైట్ యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించింది.
✦ 1966: ముంబైలో శివసేన రాజకీయ పార్టీ  స్థాపించబడింది.
✦  1981: ARIANE లాంచర్‌ను ఉపయోగించి భారతదేశపు ప్రయోగాత్మక కమ్యూనికేషన్ శాటిలైట్ apple (ఎయిర్‌లైన్ ప్యాసింజర్ పేలోడ్ ప్రయోగం) జూన్ 19న ప్రయోగించబడింది.  భారతదేశ అంతరిక్ష ప్రోగ్రామ్ లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది.  దీనిని బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ లో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు.
✦   2007: బాగ్దాద్‌లో అల్-ఖిలానీ మసీదు బాంబు దాడిలో 78 మంది మరణించారు, మరో 218 మంది గాయపడ్డారు.
✦ 2009: స్థానిక చెఫ్ అనుమానాస్పద మరణం తరువాత చైనాలోని షిషౌలో 10,000 మంది ప్రజలు, 10,000 మంది పోలీసు అధికారులు అల్లర్లకు తెగబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: