జ‌న‌వ‌రి 29వ తేదీకి ఎన్నెన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి... మీకు తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 29 వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది

ప్ర‌ముఖుల జననాలు
1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి. ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్, ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత.
1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)
1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదనరావు, తాపీ చాణక్య, ఆదుర్తి సుబ్బారావు, భీమ్‌సింగ్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 40కిపైగా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కృష్ణ, జమున హీరోహీరోయిన్లుగా రూపొందిన మనుషులు మట్టి బొమ్మలు (1974) చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన భాస్కరరావు తొలి చిత్రంతోనే ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో చక్కటి గుర్తింపును దక్కించుకున్న ఆయన కృష్ణ, కృష్టంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ లాంటి అగ్రనటీనటులతో 18 సినిమాల్ని రూపొందించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, శ్రీవారు, కుంకుమతిలకం, చల్ మోహనరంగ, రాధా మడార్లింగ్, చదరంగం, కళ్యాణ తిలకం, సర్ధార్ ధర్మన్న, అగ్గిరాజు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీవారు, శ్రీరామచంద్రులు, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, మామకోడలు చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.
1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
1962 : గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.
ప్ర‌ముఖుల మరణాలు..
2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: