సమ్మర్ లో ఎనర్జీ కోసం ఈ సలాడ్ తీసుకోండి?

Purushottham Vinay
మనం సమ్మర్లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.పుచ్చకాయని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి.అలాగే శరీరం చల్లబడుతుంది.ఇక సాధారణంగా మనం ఈ పుచ్చకాయను నేరుగా తింటూ ఉంటాము. ఇంకా అలాగే దానితో జ్యూస్ తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. ఇంకా ఇవే కాకుండా పుచ్చకాయతో సలాడ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ ఇంకా కీరదోస కలిపి చేసే  సలాడ్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవికాలంలో ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల ఎండ వల్ల ఉపశమనం దక్కడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. ఇక రుచిగా వాటర్ మెలన్ తో సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ వాటర్ మెలన్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..

పుచ్చకాయ ముక్కలు – 200 గ్రా., నిమ్మకాయ – 1, మిరియాల పొడి -అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఆలివ్ ఆయిల్ – ముప్పావు టీ స్పూన్ ఇంకా చిన్నగా తరిగిన కీరదోస – 1, పుదీనా ఆకులు – 15 అలాగే డ్రై రోస్ట్ చేసిన బాదంపప్పు – కొద్దిగా తీసుకోవాలి.


వాటర్ మెలన్ సలాడ్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ రసం, మిరియాల పొడి, ఉప్పు ఇంకా ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఆ తరువాత పుచ్చకాయ ముక్కలు, కీరదోస ముక్కలు, పుదీనా ఆకులు ఇంకా బాదంపప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే వాటర్ మెలన్ సలాడ్ తయారవుతుంది.ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాట ముక్కలు కూడా వేసుకోవచ్చు. మనం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా ఈ సలాడ్ ను తినవచ్చు. ఇక ఈ సలాడ్ ను తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు కూడా తిరిగి అందుతాయి. వేసవి కాలంలో ఈ విధంగా వాటర్ మెలన్ సలాడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: