జాయింట్ల నుంచి వచ్చే శబ్దం, కీళ్ల నొప్పులు తగ్గే టిప్స్?

Purushottham Vinay
మోకాళ్ల నొప్పులు అలాగే నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రావడం, క్యాల్షియం లోపం, ఎముకలు బలహీనంగా ఉండడం వంటి సమస్యలతో మనలో చాలా మంది చాలా బాధపడుతున్నారు.అయితే వీటిని తగ్గించడానికి ఓ సూపర్ చిట్కా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ చిట్కా కోసం నిమ్మకాయంత బెల్లాన్ని, అర కప్పు పుట్నాల పప్పును ఇంకా ఒక గ్లాస్ పాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు నల్ల రంగులో ఉండే బెల్లాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బెల్లంలో అధిక మొత్తంలో ఫాస్పరస్ ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అదే విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ బెల్లాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్ని ఈజీగా తొలగిపోతాయి. అలాగే రక్తహీనత సమస్య మన దరి చేరుకుండా ఉంటుంది.ఇంకా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.అలాగే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ప్రతి రోజూ పుట్నాల పప్పును, బెల్లాన్ని కలిపి తిని ఒక గ్లాస్ వేడి పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మళ్ళీ అవి రాకుండా ఉంటాయి.


అలాగే మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మోకాళ్ల నుండి శబ్దాలు రావడం తగ్గుతుంది. మధ్యాహ్నం భోజనం చేసిన రెండు గంటల తరువాత బెల్లాన్ని, పుట్నాల పప్పును తిని పాలను తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు ఈజీగా తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళనల మన దరి చేరకుండా ఉంటాయి. రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.ఇంకా వీటితో పాటు మెంతులను కూడా నానబెట్టి తీసుకోవాలి.ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని మెంతులతో సహా వేడి చేయాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి. ఈ విధంగా పొద్దున్నే పరగడుపున మెంతుల నీటిని తీసుకోవడం వల్ల  మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు చాలా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. మెంతుల నీటిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు  ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: