నెల రోజుల్లో అధిక బరువు ఈజీగా తగ్గే టిప్?

Purushottham Vinay
జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని చాలా వంటల్లో కూడా వేస్తారు. అయితే ఇది వంటల్లో రుచి ఇంకా సువాసనను మాత్రమే కాదు, మనకు చాలా ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్రలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక జీలకర్రను ఉపయోగించి తయారు చేసే పలు ఔషధాల సహాయంతో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. ఇక అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలి.ఇంకా ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. అలాగే అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇంకా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా కూడా నానబెట్టాలి. అలాగే పొద్దున్నే పరగడుపున ఆ నీటిని తీసి మరిగించి తాగాలి.


ఆ తరువాత నీటిలో నానిన ఆ జీలకర్రను తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట ఈజీగా కరిగిపోతుంది. ఇంకా అధిక బరువు తగ్గుతారు. ఈ జీలకర్రను 5 గ్రాముల మోతాదులో తీసుకుని పొడి చేయాలి. తరువాత దాన్ని  ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినాలి. దీంతో అధిక బరువు ఈజీగా తగ్గుతారు.ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె, 3 గ్రాముల జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పొద్దున్నే పరగడుపున తాగాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు ఈజీగా కరుగుతుంది. ఇంకా అధిక బరువు తగ్గుతారు.ఇంకా అలాగే క్యారెట్లను బాగా ఉడకబెట్టాలి.తరువాత వాటిపై నిమ్మ, వెల్లుల్లి రసం ఇంకా జీలకర్ర పొడిలను చల్లాలి. ఆ తరువాత ఆ క్యారెట్లను తినేయాలి.ప్రతి రోజూ రాత్రి డిన్నర్‌కు బదులుగా ఈ ఆహారం తింటే చాలు ఈజీగా కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఇలా జీలకర్రను చాలా రకాలుగా ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: