డయాబెటిస్ వారు వేరుశనగ తినవచ్చా..?

Divya
సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వారు ఏమి తినాలన్నా సరే సంకోచిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ముఖ్యంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి.. ఎలాంటివి తినకూడదు అనే విషయాలపై అత్యంత జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇకపోతే ఏమాత్రం పొరపాటు పడినా సరే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మధుమేహం లో కిడ్నీ డిసీజ్ , హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గిపోవడం వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలు తినవచ్చా లేదా అనే సందేహం కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

ఇకపోతే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా వేరుశనగలను పిలుస్తూ ఉంటారు.. కాబట్టి మరి ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు వీటిని తినవచ్చా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు స్థూలకాయమనేది ఇప్పుడు అత్యంత ప్రమాదకర సమస్యగా మారిపోయింది. కాబట్టి అలాంటివారు వేరుశనగ తినడం వల్ల అధిక బరువు నుంచి కాస్త మనం ఉపశమనం పొందే వీలు ఉంటుంది. ఇకపోతే శరీరానికి హెల్తి ఫ్యాట్ అందించే వేరుశనగను పేదల బాదం అని కూడా పిలుస్తారు.
 కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలు తింటే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే పీనట్ బెటర్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ వారికి చక్కటి ఆహారం. ఇక చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే వేరుశెనగ తినడం వల్ల  రక్తనాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇందులో ఫైబర్,  ప్రోటీన్ , మోనో అన్  సాచురేటేడ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల  అనేది ఎక్కువగా ఉన్న సమయంలో వేరుశనగలు తింటే న్యూట్రియన్లు అత్యంత పౌష్టికాహారంగా పనిచేసి.. ఎటువంటి సమస్యలను రాకుండా కాపాడుతాయి. అలాగే వేరుశనగలలో.. విటమిన్ b6 , విటమిన్ బి 9,  ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ , ప్యాంటో తెనిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా లభించడం వల్ల వేరుశనగ తినడం మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: