స్త్రీలు రోజుకో అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Divya
సాధారణంగా స్త్రీలు ఇంటిపని,వంటపని,పిల్లల్ని చూసుకుంటూ సరిగా ఆహారం కూడా తీసుకోలేని వారున్నారు.ఇంక ఆఫీస్ కి వెళ్ళేవారి సంగతి అదోగతి అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇంటిల్లిపాదికి వారి అవసరాలు తీర్చి,తాను కూడా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు హడావిడిలో వారి ఆహారం విషయం అస్సలు పట్టించుకోరు.అలాంటి స్త్రీలలో పోషకాహర లోపాలు కలిగి,అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా స్త్రీలు తరుచూ ఒక అరటిపండును తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్పాహారం తినేందుకు సమయం లేనివారు అరటిపండు తినడంతో,అది తక్షణమే శక్తిని అందిస్తుంది.దీని ద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి,వెంటనే శరీరంలో శక్తి వస్తుంది.స్త్రీలు ఉదయాన్నే అరటిపండు తింటే వాళ్లు రోజంతా ఎనర్జిటిక్ గా వుంటారు.మరియు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.అరటిపండ్లలో పొటాషియం పుష్కళంగా లభిస్తుంది.దీనితో ఒత్తిడిని తగ్గిస్తుంది.సాధారణంగా ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని పొటాషియమ్ కంట్రోల్ చేస్తుంది.స్త్రీలు కుటుంబ సమస్యలతో ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా అరటిపండు తినడం చాలా ఉత్తమం.మరియు అరటిపండులో కార్బోహైడ్రేట్లు,పొటాషియమ్,విటమిన్ బి6,ఫైబర్, మెగ్నీషియమ్ ఉంటాయి.ఇది తొందరగా జీర్ణం అయి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడంతో పాటు,జీర్ణసమస్యలను తగ్గిస్తుంది.ఆజీర్తి,మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా అరటిపండు తినాలి.అప్పుడే జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు తరచూ అరటిపండు తీసుకోవడం వల్ల ఇందులోని పోలిక్ యాసిడ్ వారి ఆరోగ్యాన్ని పెంచుతుంది.పోలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల ప్రసవ సమయంలోను,ఆ తర్వాత బిడ్డకు తగినన్ని పాలు ఊత్పత్తి అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక రుతుక్రమణ సమయంలో అధిక రక్తస్రావము,లేక పీరియడ్స్ రాకుండా ఉండడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.ఇటువంటి సమస్యలను తగ్గించడానికి కూడా పోలిక్ యాసిడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.మరియు ఇందులోని ఐరన్ కొత్త రక్తకణాలను వృద్ధి చెందించి,రక్తహీనతను తగ్గిస్తుంది. స్త్రీలు ఎక్కువగా ఎనిమియాతో బాధపడుతుంటారు. అలాంటివారు రోజుకో అరటిపండు తినడం ఉత్తమం. అంతేకాక అధిక బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు అరటిపండును తగిన మోతాదులో తీసుకోవాలి.దీనితో ఇందులోని ఫైబర్ వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: