కడుపు నొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు?

Purushottham Vinay
కడుపు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కడుపు నొప్పిని తగ్గించడంలో లెమన్ టీ మనకు చాలా బాగా సహాయపడుతుంది. అజీర్తిని తగ్గించడంలో, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇంకా కడుపులో ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో లెమన్ టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఈ టీని తయారు చేసుకోవడానికి  ఒక గిన్నెలో 3 కప్పుల నీటిని తీసుకోని ఆ తరువాత ఇందులో 4 లేదా 5 తులసి ఆకులు, 3 నిమ్మకాయ ముక్కలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వాము వేసి ఈ నీటిని చిన్న మంటపై బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచి ఆ తరువాత వడకట్టుకుని తాగాలి. ఇలా నిమ్మకాయ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కడుపు నొప్పి నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. కడుపు నొప్పిని ప్రభావవంతంగా తగ్గించడంలో అల్లం టీ చాలా బాగా సహాయపడుతుంది.ఇందు కోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను ఇంకా కొన్ని మిరియాలను దంచి వేసుకోవాలి.ఆ తరువాత ఈ నీటిని మరిగించి వడకట్టుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనెను కూడా కలిపి తాగాలి. ఇలా అల్లం టీ ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.


ఇంకా అలాగే ఈ టీ ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి ఇంకా తల తిరగడం వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపులో నొప్పి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో  చక్కగా పని చేస్తుంది. అందుకోసం కోసం ఒక కప్పు పెరుగును తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పెరుగును తీసుకోవడం వల్ల కడుపు నొప్పి ఈజీగా తగ్గి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అదే విధంగా సోంపు గింజలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే సోంపు గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా సోంపు గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: