కండ్లకలకని తగ్గించాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
కండ్లకలక షాంపూ, తరచూ వాడే లెన్సులు ఇంకా ధూళి కారణంగా వస్తుంది.ఇంకా అలాగే కండ్ల కలక ఇన్ఫెక్షన్ వెనుక బ్యాక్టీరియా, వైరస్, అలెర్జీ ఇంకా ఫంగస్ కూడా  అవుతుంటాయి.ఇక ఈ సమస్య కొన్ని సార్లు దీర్ఘకాలికంగా ఉంటుంది. కండ్లకలక సాధారణంగా 1 నుండి 2 వారాల దాకా ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది 4 వారాల కంటే ఎక్కువగా ఉంటుంది.కండ్లకలక ఉన్న వ్యక్తి కంటిలోకి చూస్తే, అది వాళ్లకి కూడా సోకుతుందనే నమ్మకంగా చాలా మందిలో కూడా ఉంటుంది. నిజానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. కలక అనేది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అవుతుంది. అయితే ఇది మాత్రం అంటువ్యాధి అని  చెప్పవచ్చు ఉదాహరణకు కండ్ల కలక ఉన్న వ్యక్తి తన కళ్లను, ఒక గుడ్డ లేదా కర్చీఫ్ తో తుడుచుకుంటే ఇంకా ఆ కర్చీఫ్ ని మీరు వాడినట్లయితే మీకు ఈ కండ్ల కలక సోకే ప్రమాదం ఉంటుంది. ఇంకా అలాగే కండ్ల కలక ఉన్న వ్యక్తి కళ్ళను నులుముకొని అదే చేతులతో మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లయితే, మీకు ఖచ్చితంగా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.


ఇక CDC ప్రకారం ఈ వ్యాధిని వైరల్ కన్జక్టివిటిస్ అని అంటారు. ఇది కూడా ఒక అంటువ్యాధి. ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి కళ్ళతో సంపర్కం వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ కన్నీళ్లు ఇంకా శ్వాసకోశంలో కూడా ఉంటుంది. ఈ సమస్య ఉన్న వ్యక్తి మాట్లాడే సమయంలో నోటి ద్వారా వచ్చే తుంపర్ల లో ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.ఈ కండ్ల కలక సోకిన వ్యక్తి తరచూ చల్లటి నీటితో కళ్ళను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా కంటి నరాలు కొంచెం ఉపశమనం పొందుతాయి. వీలైతే ఐస్ నీళ్లతో కళ్ళను కడుక్కుంటే ఇంకా చాలా మంచిది.అలాగే ఆయుర్వేదం ప్రకారం కళ్ళలో కొద్దిగా పచ్చ కర్పూరం వేసుకుంటే  బ్యాక్టీరియా వైరస్ శుభ్రం చేసుకునే అవకాశం ఉంది.అలాగే కండ్ల కలక సోకిన వ్యక్తి పుష్కలంగా మంచి నీళ్లు తాగాలి. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన డైట్ విధానాలను కూడా పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: