ఆరోగ్యానికి చాలా మేలు చేసే సూప్ లు ఇవే?

Purushottham Vinay
ప్రతి రోజు పచ్చి కూరగాయలతో తయారు చేసిన సూప్‌లను తాగడం వల్ల ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను కూడా ఈజీగా నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబటి ఏ కూరగాయలతో తయారు చేసిన సూప్‌లను తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సొరకాయ సూప్  శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఈ సూప్‌ను వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఇంకా ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా బాణలిలో తగినంత నూనె వేసుకుని, ఉల్లిపాయలు ఇంకా టమోటాలు ముక్కలను వేసి వాటిని దోరగా వేయించుకోవాలి.ఇక ఆ తర్వాత అందులోనే కొన్ని నీటిని వేసి బాగా మరిగించి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న సూప్‌ ని చల్లారిన తర్వాత తీసుకోవాలి.అలాగే ప్రతి రోజు బీట్‌రూట్‌తో తయారు చేసిన సూప్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.


ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసేందుకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.అయితే ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా గ్యాస్‌ స్టవ్‌ ని వెలిగించాలి. ఇక ఆ తర్వాత ఓ బౌల్‌ పెట్టి అందులో తగినంత నూనెను వేసి ఉల్లిపాయ, టొమాటో ఇంకా బీట్‌రూట్ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి.ఇక ఇలా వేయించిన తర్వాత అందులోనే రెండు కప్పుల నీటిని వేసి మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత పొద్దున పూట అల్పాహారంలో తీసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.ఇంకా అలాగే కాలీఫ్లవర్ సూప్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ సూప్‌ను తయారు చేయడానికి ముందుగా నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కాలీఫ్లవర్ ముక్కలు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇక ఆ తర్వాత అందులో రెండు గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత ఉప్పు వేసి పక్కన పెట్టాలి. ఈ సూప్‌ చల్లారిన తర్వాత తీసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: