టేస్టీ అండ్ హెల్తీ సమ్మర్ డ్రింక్ ఇదే?

Purushottham Vinay
బయట ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ సీజన్లో మండుతున్న ఎండలు ఇంకా మండే వేడి నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది ఎక్కువగా కూల్ డ్రింక్ తాగడానికి ఇష్టపడుతున్నారు.అలాగే ప్రజలు హైడ్రేటెడ్ గా ఎనర్జిటిక్ గా ఉండడానికి చాలా పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే వేసవికాలంలో జ్యూస్, కొబ్బరి నీళ్లు ఇంకా చెరుకు రసం లాంటివి ఆరోగ్యకరమైన పానీయాలు. ఇంకా అదే విధంగా ఈ జ్యూస్ కూడా చాలా మేలు చేస్తుంది. పుదీనా అలాగే నిమ్మకాయతో చేసిన షర్బతు తాగడం వలన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది. ఇది వేసవికాలంలో శరీరాన్ని బాగా చల్లగా ఉంచుతుంది.ఈ ఎండల వేడి నుండి ఉపశమనం కోసం నిమ్మకాయ, పుదినా చాలా బాగా ఉపయోగపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.


దీన్ని తాగడం వలన మీరు శరీరాన్ని మండే వేడిలో కూడా చాలా చల్లగా ఉంచుకోవచ్చు. అయితే దీనిని తయారు చేసుకోవడానికి పుదీనా ఇంకా నిమ్మకాయలను ఉపయోగించాలి. అయితే ఈ నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫస్ట్ మీరు పుదీనా తీసుకుని శుభ్రమైన నీటిలో ఆకులను బాగా కడగాలి. ఇక ఆ తర్వాత ఒక గిన్నెలో పుదీనా ఆకులను పక్కన పెట్టుకోవాలి.తరువాత నిమ్మకాయ రసాన్ని తీయాలి. ఆ తర్వాత మిక్సీలో పుదీనా ఆకులు, నిమ్మరసం ఇంకా పంచదార నీటిని కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక అలాగే జీలకర్ర పొడి కూడా వెయ్యాలి. ఆ తర్వాత ఆ సిరప్ ను ఫిల్టర్ చేసి నాలుగు గ్లాసుల్లో సమాన పరిమాణంలో వేసుకొని తాగేముందు ఒక్కొక్కటి ఐస్ క్యూబ్ వేసుకుని చల్లచల్లగా తాగితే చాలా అద్భుతమైన రుచి మాత్రమే కాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: