ఎక్కువ ఏసీలో ఉంటే కలిగే నష్టాలు ఇవే?

Purushottham Vinay
ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. అందరూ కూడా ఏసీలు కొంటున్నారు. అయితే బయట ఉన్న ఎండ వేడితో వచ్చే సమస్యల కంటే ఎక్కువ సమయం ఏసీలో ఉండటం వల్ల వచ్చే సమస్యలే చాలా ఎక్కువ అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.ఇక అలా వచ్చే ఆరోగ్య సమస్యనే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని అంటారు. ఎంత ఆరోగ్యంగా ఉన్న వారికైనా సరే.. ఎక్కువ చల్లదనంతో ఏసీలో కనుక ఉన్నట్టయితే.. వారి ఆరోగ్యంపై ఏసీ వినియోగం దుష్ర్పభావమే చాలా ఎక్కువగా ఉంటుంది.వారి శ్వాసకోశాలలో ఖచ్చితంగా మార్పులు చోటుచేసుకుని ఆస్తమా లాంటి జబ్బులు ఎటాక్ అవుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల కలిగే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం.చాలా ఎక్కువ సమయం చల్లటి గాలికి ఎక్స్ పోజర్ అవడం వల్ల బ్రాంచియల్ ఇన్ ఫ్లమేషన్ అనే సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఇది చాలా జబ్బులకు మూల కారణం అవుతుంది.ఏసీలో ఉన్న వారికి సాధారణంగా అలసట రాదు అనే భావన చాలామందిలో కూడా ఉంటుంది. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు.


ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారు త్వరగా అలసిపోవడం ఇంకా కళ్లు తిరగడం వంటి సమస్యలు కనిపించినట్టు చాలా అధ్యయనాల్లో తేలింది.ఇంకా అలాగే జలుబు, దగ్గు లాంటి ఫ్లూ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.అలాగే ఏసీ గదుల్లో మాయిశ్చర్ అనేదే ఉండదు. ఇక గాలిలో ఉన్న మాయిశ్చర్ ని ఎయిర్ కండిషనర్స్ పూర్తిగా పీల్చేస్తాయి. ఇంకా అలాగే అక్కడున్న వారి శరీరంలో కూడా తేమ అనేదే లేకుండా అవుతుంది. అలా డీహైడ్రేషన్ సమస్య బాగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ డైహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, కిడ్నీలు దెబ్బ తినడం ఇంకా హార్ట్ స్ట్రోక్ రావడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.ఇక ఎయిర్ కండిషనర్ నుంచి వెలువడే చల్లటి గాలి మైక్రోబయల్ ఎలర్జెన్స్ కి నివాసంగా మారుతుంది. అందువల్ల కళ్లు, ముక్కు, గొంతులో దురద రావడం, పదే పదే తుమ్ములు రావడం, తొలనొప్పి రావడం, టాన్సిల్స్, సైనస్ సమస్యలు తలెత్తడం ఇంకా అలాగే ఒంటి నొప్పులు రావడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AC

సంబంధిత వార్తలు: