జీడిపప్పు అధికంగా తింటే కలిగే నష్టాలు ఇవే?

Purushottham Vinay
జీడిపప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఈ జీడిపప్పులో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నందు వలన, జీడిపప్పును ఎక్కువగా తినకుండా ఉండాలంటున్నారు. జీడిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ జీడిపప్పులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇనుము అధిక వినియోగం అనేది ఖచ్చితంగా కణాల పనిని ప్రభావితం చేస్తుంది. ఈ కణాలలో ఇనుము నిక్షిప్తమవుతుంది.ఇక ఇది ఊపిరితిత్తుల కణాలలో పేరుకుపోయినట్లయితే.. ఆస్తమా లక్షణాలు కూడా కనబడతాయి. అందువల్ల మనిషికి శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది.ఇంకా అలాగే ఈ జీడిపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.మీరు ఎక్కువ ఫైబర్ తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ అనేది సంభవించవచ్చు. ఎందుకంటే ఫైబర్ సరిగ్గా కరిగిపోవడానికి నీరు చాలా అవసరం. 


మన శరీరంలో పీచుపదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది శరీరంలోని నీటిని పీల్చుకుంటుంది. దీని వల్ల మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా మొదలవుతాయి.జీడిపప్పులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఇంకా కాల్షియం ఉంటాయి. అందువల్ల జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.అలాంటి పరిస్థితిలో, మీకు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జీడిపప్పును తినకుండా ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్య బాగా పెరుగుతుంది.అలాగే ఈ జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం ఇంకా రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే మధుమేహం ఇంకా థైరాయిడ్ రోగులు జీడిపప్పు అస్సలు తినకూడదు. మీకు ఇప్పటికే ఊబకాయం సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు జీడిపప్పు తినకుండా ఉండాలి.కాబట్టి జీడిపప్పుని మితంగా మాత్రమే తినండి. ఎక్కువగా తినకండి. ఎక్కువగా తింటే ఖచ్చితంగా నష్టాలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: