పుచ్చకాయ తినడం వల్ల కలిగే అద్భుత లాభాలు ఇవే?

Purushottham Vinay
ఎండలు బాగా మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అయితే ఏకంగా 44 డిగ్రీలు దాటుతున్నాయి.ఈ మండే వేడికి శరీరంలో ఎక్కువ చెమట కారడం సర్వ సాధారణం అయిపోయింది.ఈ సీజన్‌లో శరీరంలో నీరు లేకపోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్, వడదెబ్బ ఇంకా తలనొప్పి వంటి సమస్యలు ఎంతగానో వేధిస్తాయి. డీహైడ్రేషన్ అనేది అన్ని సమస్యలకు కారణం అయ్యింది. ఈ సీజన్ లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ద్వారా తలనొప్పి ఇంకా వడదెబ్బ వంటి సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఈ డీహైడ్రేషన్ అనేది తలనొప్పికి సాధారణ కారణం, వేసవి కాలంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకుంటే, ఈ సమస్యను ఖచ్చితంగా నివారించవచ్చు.ఇక అపోలో స్పెక్ట్రా ముంబైలోని డైటీషియన్ ఫౌజియా అన్సారీ ప్రకారం, తలనొప్పికి డీహైడ్రేషన్ అనేది చాలా ముఖ్యమైన కారణం.ఈ డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని అధిగమించడానికి, నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయను తినండి.ఇక నీరు అధికంగా ఉండే పుచ్చకాయ డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి నుండి ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది.


ఈ పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది, ఇది రక్త నాళాలు విశ్రాంతిని ఇంకా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయ తలనొప్పి ఇంకా తీవ్రతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ పుచ్చకాయ రసం తీసిన తర్వాత వాడితే, అది ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జ్యూస్ అన్ని రకాల తలనొప్పిని నయం చేయదు, అయితే ఇది శరీరాన్ని తాజాగా ఇంకా హైడ్రేట్ గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో పుచ్చకాయ రసం చాలా బాగా పనిచేస్తుంది.పుచ్చకాయ రసం రోజంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఇంకా రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే చర్మాన్ని  తేమగా కూడా ఉంచుతుంది. ఇంకా అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే ఇది చర్మం ఇంకా జుట్టును కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: