సమ్మర్లో నీరసంని తగ్గించే సూపర్ డ్రింక్ ఇదే?

Purushottham Vinay
ఈ ఎండా కాలంలో ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానీయాలకు బదులుగా మన ఇంట్లోనే చాలా సులభంగా ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఎండ నుండి ఈజీగా ఉపశమనం కలగడంతో పాటు శరీరానికి కడా చలువ చేస్తుంది.ఇంకా అలాగే నీరసం కలగకుండా ఉంటుంది. ఈ డ్రింక్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఇంకా చల్ల చల్లగా సమ్మర్ స్పెషల్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..పాలు  అర లీటర్, నానబెట్టిన బాదంపప్పు 20, కస్టర్డ్ పౌడర్  ఒక టేబుల్ స్పూన్, నీళ్లు  పావు కప్పు, పంచదార  4 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్  కొద్దిగా ఇంకా అలాగే నానబెట్టిన సబ్జా గింజలు  ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.ఈ డ్రింక్ తయారీ విధానం విషయానికి వస్తే..మీరు ముందుగా బాదంపప్పు ఉండే పొట్టును తీసేసి వాటిని ఒక జార్ లోకి తీసుకోని ఆ తరువాత ఇందులో నీళ్లు, కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.


ఆ తరువాత కళాయిలో పాలు వేసి బాగా వేడి చేయాలి.ఆ పాలు వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమం వేసి బాగా కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పంచదార ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి.ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఇందులో సబ్జా గింజలను వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో పోసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి.ఇక రెండు గంటల తరువాత దీనిని మరోసారి కలుపుకుని గ్లాస్ లో పోసుకుని తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఈజీగా తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఈ విధంగా ఇంట్లోనే ఈ టేస్టీ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం నుండి ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: