గర్భం వచ్చే ముందు కలిగే లక్షణాలు ఇవే?

Purushottham Vinay
ఈ సృష్టిలో తల్లికి మించినది ఏది లేదు. తల్లి అవ్వాలని పెళ్లి అయిన ప్రతి మహిళ కోరుకుంటుంది.పెళ్ళైన స్త్రీ గర్భం దాల్చినప్పుడు కలిగే ఆ ఆనందమే వేరు. ఎంతో కాలంగా కంటున్న కలలు నిజమైన వేళ కలిగే ఆ ఆనందం అసలు అంతా ఇంతా కాదు.అయితే చాలా మంది స్త్రీలు కూడా గర్భం దాల్చిన తరువాత వారు తల్లి కాబోతున్నారని తెలుసుకోలేక పోతుంటారు. వారిలో కొన్ని లక్షణాలు కనిపించినప్పటికి వాటిని వారు సరిగ్గా గుర్తించలేకపోతుంటారు. అయితే ఈ లక్షణాలు అందరిలో ఎప్పుడు ఒకే విధంగా ఉండవు.శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటాయి.కొంత మందిలో అయితే అసలు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు కూడా. గర్భం దాల్చిన తరువాత అందరిలో మొదటగా కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.అయితే గర్భం దాల్చిన తరువాత నెలసరి రాదు. నెలసరి రావడం ఆలస్యమైన పది రోజుల తరువాత వైద్యుని సంప్రదించి ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ఇంకా అలాగే కొందరిలో వాంతులు, వికారం, తలనొప్పి, తల తిరిగినట్టుగా కూడా ఉంటుంది. అన్నం అసలు తినాలనిపించదు.


కూరల వాసనను అసలు భరించలేకపోతారు. ఇంకా అదే విధంగా కొందరిలో కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. గర్భాశయంలో పిండం స్థిరపడేటప్పుడు ఈ విధంగా నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.ఇంకా అదే విధంగా కొందరిలో ఛాతి పరిమాణం పెరిగినట్టుగా కూడా ఉంటుంది. వారి స్థనాలు గట్టిగా మారుతాయి. ఇంకా అలాగే స్థనాలు సున్నితంగా కూడా తయారవుతాయి.అయితే కొందరిలో నెలసరి వచ్చే ముందు కూడా ఈ లక్షణాలనేవి కనిపిస్తాయి.ఇక వీటినే ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారు.అయితే ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి. ఇంకా అలాగే గర్భం దాల్చిన రెండు వారాల నుండి ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. సాధారణ సమయంలో పలుచగా వచ్చే వైట్ డిశ్చార్జ్ గర్భంతో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చిక్కగా వస్తుంది. ఈ లక్షణాలను బట్టి స్త్రీలు గర్భం దాల్చారో లేదా సులభంగా తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: