లివర్ ఆరోగ్యానికి ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి?

Purushottham Vinay
మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వైద్యుని సలహా లేకుండా మందులు వాడడం, మద్యపానం ఇంకా అలాగే ఒత్తిడి వంటి వివిధ కారణాలు కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం కాలేయాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలేయంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడే కాలేయం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో మనం చాలా సులభంగా కాలేయాన్ని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. వీటితో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయం పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది.అయితే ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను, కొత్తిమీరను, నిమ్మరసాన్ని ఇంకా పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. సొరకాయను ఉపయోగించడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు వివిధ రకాల కాలేయ సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. వీటిలో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే కొత్తిమీరను వాడడం వల్ల కూడా కాలేయం బాగా శుభ్రపడుతుంది.


పసుపును వాడడం వల్ల కాలేయంలో ఉండే విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. ఈ పదార్థాలన్నీ కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో బాగా సహాయపడతాయి.వీటితో జ్యూస్ ను తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక జార్ లో ఒక కప్పు సొరకాయ ముక్కలను తీసుకోని ఆ తరువాత ఇందులో గుప్పెడు కొత్తిమీర, తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో అర చెక్క నిమ్మరసం, తగినంత నల్ల ఉప్పు ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇక ఇలా చేయడం వల్ల లివర్ డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది. ఈ జ్యూస్ ను పొద్దున పూట పరగడుపున తాగాలి. దీనిని తాగిన అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయంలోని మలినాలు ఇంకా విష పదార్థాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరు కూడా బాగా మెరుగుపడుతుందని కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: