ఏడవడం వల్ల కుడా లాభాలుంటాయని మీకు తెలుసా..?

Divya
చాలా మంది ఇళ్లలో పెద్దలు ఆడవారిని, పిల్లలను ఎందుకు ఎప్పుడూ ఏడుస్తుంటావ్, ఇలా ఏడవడం వల్ల ఇంటికి అరిష్టము అని తిడుతూ ఉంటారు.కానీ ప్రతి ఒక్కరూ బాధ కలిగి ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఏడవమని చెబితే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగడం సహజం.కానీ ఏడవడం వల్ల కూడా లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కంటి సమస్యలు..
సందర్భానుసారంగా ఏడ్చేవారికి, కళ్ళలోని బాక్టీరియా, కళ్ళు పొడిబారడం, కళ్ల మసక వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలు..
చాలా మంది బావోద్వేగాలను బయట పెట్టకుండా,మనసులోనే మదన పడుతూ ఉంటారు.అలాంటి వారికి గుండె బరువెక్కి పోయి, తొందరగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కొన్ని అధ్యయనాలు ప్రకారం గుండెపోటు ఆడవారి లో కన్నా మగవారిలో ఎక్కువ వస్తూ ఉందని చెబుతున్నారు.దీనికి కారణం మగవారు చాలా సమస్యలను లోపలే దాచుకొని గుండెకు అధిక శ్రమను కలిగిస్తూ ఉంటారు.అలాంటి వారు ఒంటరిగా వున్నపుడైనా ఏడవడం చాలా ఉత్తమం.
డిప్రెషన్..
కొంతమంది బాదను ఎవరితోనూ చెప్పలేక,లోలోపలే కుమిలిపోతుంటారు.అలాంటి వారు క్రమంగా డిప్రెషన్ గురవుతుంటారు. కావున బాధని తగ్గించేందుకు బోరున ఏడవడం చాలా మంచిది.
నిద్ర..
ఏడుపు మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది.ఆందోళన తగ్గి,తొందరగా నిద్రకు ఉపక్రమించవచ్చు.మనసు నిర్మలంగా ఉంటుంది.
మెంటల్ స్ట్రాంగ్..
మెంటల్ గా స్ట్రాంగ్ అవడానికి ఏడుపు చాలా బాగా ఉపయోగ పడుతుంది.శరీరానికి నొప్పిని భరించే శక్తి పెరుగుతుంది. గుండె ఎటువంటి చెడు వార్త విన్నా, ఎటువంటి ప్రమాదం కలగకుండా ఏడుపు ఉపయోగపడుతుంది.
గుడ్ పీలింగ్..
బాధతో ఏడవడం వల్ల,మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్పిన్ వంటి హార్మోన్స్ విడుదల అవడంతో, మనసు  సంతోషం కలుగుతుంది.
ఓదార్పు..
ఎవరైనా ఏడుస్తుంటే వారిని అలానే వొదిలి వేయకుండా ఓదార్పు కలిగించాలి. మనసుకు నచ్చిన వారి ఓదార్పు వారిని డిప్రెషన్ లోకీ వెళ్లకుండా బయటపడొచ్చు.
కావున ప్రతి ఒక్కరూ బాధ కలిగినప్పుడు ఏడవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: