బీపిని ఈజీగా తరిమికొట్టే టిప్?

Purushottham Vinay
ఒత్తిడి, ఆందోళన, విరామం లేకపోవడం ఇంకా మారిన ఆహారపు అలవాట్ల కారణంగా రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దీని వల్ల మన శరీరంలో అధిక రక్తపోటు సమస్య అనేది తలెత్తుతుంది. గుండె రక్తాన్ని వేగంగా పంపిణీ చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తం స్పీడ్ గా ప్రవిహిస్తుంది. అందుకే దీనిని రక్తపోటు అంటారు. రక్తపోటు  చెడు ప్రభావం మెదడు, గుండె,మూత్రపిండాలపై అధికంగా ఉంటుంది. దీని వల్ల పక్షవాతం ఇంకా గుండెపోటు వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మెడ భాగంలో నొప్పిగా ఉంటే అధిక రక్తపోటు బారిన పడినట్టు ఒక సంకేతంగా భావించాలి. అలాగే కళ్లు తిరిగినట్టు అనిపించడం, చేతులు, భుజాల భాగంలో నొప్పి ఉండడం, తరచూ మూత్రవిసర్జన చేయడం ఇంకా అలాగే గుండె చుట్టూ నొప్పి వచ్చినట్టు ఉండడం వంటి వాటిని అధిక రక్తపోటు లక్షణాలుగా భావించవచ్చు. అధిక రక్తపోటు వల్ల ఎప్పుడూ ఒత్తిడికి గురి అయినట్టు ఉంటుంది. చాలా ఆందోళనగా ఉంటుంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె పోటు రావడంతో పాటు కంటి చూపు కూడా ఖచ్చితంగా మందగిస్తుంది.


అలాగే డయాబెటిస్ ఇంకా థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడే వారు, ఎక్కువగా పెయిన్ కిల్లర్ లను వాడే వారిలో, అధిక బరువుతో బాధపడే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి డాక్టర్ లు మనకు మందులను సూచిస్తూ ఉంటారు.అయితే ఈ మందులను మనం జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అలాగే ఈ మందులను వాడడం వల్ల చాలా దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వీటితో ఓ టిప్ తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. దీని కోసం గసగసాలను, పుచ్చకాయ గింజలను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక కప్పు గసగసాలను తీసుకొని జార్ లో వేసి పొడి చేసుకోవాలి. తరువాత పుచ్చకాయ గింజలను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి కలపాలి. దీనిని పొద్దున అల్పాహారం చేయడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల క్రమంగా మనం అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: