తెల్ల తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

Purushottham Vinay
తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది కూడా అది సహజ సిద్ధమైన తేనె కాదని భావిస్తారు.కానీ తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్న తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైన తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. ఇక ఈ తెల్లటి తేనె వల్ల కలిగే లాభాలు ఏమిటి..? తెల్ల తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులకు మనం దూరంగా ఉండవచ్చు..వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుపు రంగులో ఉన్న తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా అంటారు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని  హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఈ విధమైన తెల్ల తేనెను ఉపయోగించి దగ్గు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల చాలా మంది కూడా దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ తేనె ఇంకా నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ పొద్దున పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగటం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు ఇంకా నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇలా తెల్ల తేనె వల్ల మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చు.కాబట్టి తెల్ల తేనెను వాడండి. వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: