ఈ టేస్టీ ఫుడ్ తింటే భయంకర జబ్బులన్నీ మాయం?

Purushottham Vinay
మన పాత కాలపు ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచివి. అవి ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఈ చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్ ఇంకా కొవ్వు పదార్థాలతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. మన ఎముకల ధృత్వానికి, రక్తహీనతకు సూపర్ ఫుడ్ రాగులు. అయితే రాగులను ఏ విధంగా ఆహారంగా తీసుకున్నా చాలా వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. రాగి ఇడ్లి, రాగి దోశ ఇంకా రాగి ఊతప్పం వంటి టిఫిన్స్ తో పాటు.. జావ వంటి వాటిని కూడా సులభంగా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఈ రాగి జావను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఈ రాగి జావ టెస్ట్ ఉండదు అంటూ దూరం జరుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు, పెద్దలుకి నచ్చే విధంగా రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన రాగి ఖర్జూరం జావను తయారు చేసుకొని తాగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.దీన్ని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.


ఫస్ట్ ఖర్జురం నుంచి గింజలు తీసుకుని వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి. తరువాత అర కప్పు పాలు పోసుకుని గింజలు తీసుకున్న ఖర్జూరాలను వేసి ఉడికించాలి.అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకుని వాటిని చల్లారబెట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెను తీసుకుని రాగిపిండి ఇంకా కొంచెం నీరు పోసుకుని వాటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత తీసుకుని నీరు మొత్తాన్ని పోసుకుని స్టవ్ మీద పెట్టి.. దగ్గరగా వచ్చే దాకా ఉడికించండి.ఆ రాగి పిండి ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఖర్జూరం పలు పేస్ట్ వేసుకుని , మిగిలిన పాలని వేసి బాగా కలుపుకోవాలి. అది ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి.అలాగే మరికొంచెం సేపు రాగి ఖర్జూరం ఉడికించి స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి. అంతే రాగి ఖర్జూరం జావ రెడీ అయిపోతుంది. తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: