వేసవి కాలంలో ఈ పండుని ఖచ్చితంగా తినండి?

Purushottham Vinay
వేసవి కాలంలో లభించే అద్భుతమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపించే ఫేమస్ ఫ్రూట్. దీనిని ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ వేసవి కాలంలో ఎక్కడ చూసినా తాటి ముంజలు ఎక్కువగా అమ్మడం చూస్తుంటాం. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి ఇంకా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఇంకా కాల్షియం వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు సి, ఎ, ఇ ఇంకా కె కూడా ఉంటాయి.ఇంకా అంతే కాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, జింక్ అలాగే ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇకపోతే, తాటి ముంజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వేసవి కాలంలో డీహైడ్రేషన్ చాలా సర్వసాధారణం.శరీరంలో డీహైడ్రేషన్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితిలో అల్ఫాహారంగా కూడా తినడం మంచిది.


ఇది శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది.ఇంకా హైడ్రేట్ చేస్తుంది. ఇది సహజంగా డీహైడ్రేషన్‌తో పోరాడటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తింటే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.వేసవి కాలంలో ముంజలు తింటే బరువు చాలా సులభంగా తగ్గుతారు. ముంజల్లో క్యాలరీలు తక్కువగానూ ఇంకా నీటిశాతం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి అంతగా వేయదు. ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది జీవక్రియను కూడా సక్రమంగా నిర్వహించేలా చేస్తుంది.కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారు వేసవి కాలంలో ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ పండుని తింటే ఈజీగా పెరుగుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని ఈజీగా వ్యాధుల నుండి కాపాడుతుంది. ఇంకా అలాగే శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: