మట్టికుండ నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..?

Purushottham Vinay
మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.అలాగే మంచినీళ్లు కూడా తాగాలి. ఇంకా చెప్పాలంటే, ఆహారం కంటే కూడా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.ఎందుకంటే మనం లేక పోయిన కొన్ని వారాలపాటు జీవించగలం కానీ, నీళ్లు తాగకపోతే మాత్రం కనీసం రెండు రోజులు కూడా బతకడం చాలా కష్టం. ఎందుకంటే మన శరీరం ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది..అసలు సీజన్‌తో సంబంధం లేకుండా రోజుకు ఖచ్చితంగా 10 గ్లాసుల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు, ఇంకా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ నీరు తాగాలి. కానీ, చాలా మంది కూడా వేసవి కాలంలో ఫ్రిజ్‌లోని నీటిని ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి ఖచ్చితంగా హాని జరుగుతుంది. కానీ, మట్టి కుండలోని నీటిని తాగితే ఆరోగ్యం మరింతగా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ వేసవి కాలంలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..


మట్టి కుండలో నీరు పోస్తే న్యాచురల్ గా అవి చల్లబడతాయి. ఇక బాష్పీభవన ప్రక్రియలో కుండలోని నీరు వేడిని కోల్పోతుంది. అందువల్ల త్వరగా చల్లబడుతుంది. ఇక రిఫ్రిజిరేటర్ నీటిని వేగంగా చల్లబరుస్తుంది. కానీ, ఈ నీటిని తాగడం వల్ల దురద, గొంతు మంట ఇంకా గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కానీ మట్టి కుండ నీరు తాగడం వల్ల ఈ సమస్యలు అస్సలు రావు. ప్రతి రోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల జీవక్రియ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. నీటిలో ఉండే మినరల్స్ జీర్ణక్రియకు కూడా బాగా సహకరిస్తాయి. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత ఈజీగా మెరుగుపడుతుంది.కుండకున్న పోరస్‌ స్వభావం నీటి నుండి మలినాలను చాలా ఈజీగా ఫిల్టర్‌ చేసి, నీటిని శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: