బియ్యం కడిగిన నీళ్లతో ఇన్ని ఉపయోగాలా..!

Divya
సాధారణంగా అన్నం వండడానికి ముందు బియ్యం కడిగి ఆ నీటిని పడేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే అసలు అలా పడేయలేరు. బియ్యం కడిగిన నీటిలో ముఖ్యంగా బి విటమిన్స్ అధికంగా ఉండి,బెరుబరీ వ్యాధి రాకుండా కాపాడుతాయి.ఇలా బియ్యం కడిగిన నీళ్లు ఆరోగ్యానికే కాక వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరస్తుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా..
బియ్యం కడిగిన నీళ్లలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయం చేస్తుంది. వీటితో ముఖం తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై జిడ్డు, మృత కణాలు వంటివి తొలగిపోయి,నిగనిగలాడుతుంది.మరియు, మోచేతులపై, మెడపై ఉన్న నలుపుదనం తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ సమ్మర్ సీజన్ లో అధిక వేడి వల్ల కలిగే,చెమట,పొక్కులను, దురదలను తగ్గింస్తుంది. వీటితో చర్మాన్ని తరుచూ శుభ్రం చేసుకోవడం వల్ల కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మొఖానికి సహజ నిగారించేలా చేస్తుంది. మరియు ఈ నీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
బియ్యం కడిగిన నీటిని డిష్‌వాషర్‌గా కూడా వాడుకోవచ్చు.వాటిలోని స్టైన్ రిమూవల్ గుణాలు, సామాన్లు మెరిసేలా చేస్తాయి.మరియు కొన్ని రకాల వంటలు వండినప్పుడు గిన్నెలు వాసన వస్తూనే ఉంటాయి. అలాంటి గిన్నెలు తోమడానికి నీటిని ఉపయోగించడంతో  అందులోని వాసన తొందరగా తొలగిపోతుంది.ఏదైనా నూనె వంటకాలు చేసినప్పుడు కలిగే జిడ్డును పోగొట్టడానికి,బియ్యం కడిగిన నీటిలో వాటిని అరగంట సేపు నానబెట్టి,తర్వాత వాటిని సబ్బుతో శుభ్రం చేయాలి. దీనితో గిన్నెలకు వున్న జిడ్డు తొందరగా వదులుతుంది.
బియ్యం కడిగిన నీటిని చేదు కూరగాయలను ఉడకబెట్టేందుకు వాడటం వల్ల, వాటికి ఉన్న చేదు తగ్గుతుంది.చేపలు వండిన గిన్నెలు వాసన రాకుండా శుభ్రం చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
అంతేకాక వీటిని పడేయకుండా చెట్లకు పోయడం వల్ల,ఇందులోని న్యూట్రియాంట్స్ చెట్లు ఎపుగా పెరగడానికి దోహదపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: