పుచ్చకాయ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే?

Purushottham Vinay
పుచ్చకాయను తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో తక్కువ క్యాలరీలు ఉండడంతో పాటు చాలా రకాల మినరల్స్ కూడా ఉన్నాయి. ఇది త్వరగా బరువు తగ్గేలా చేయడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో కూడా  మనకు చాలా సహాయపడుతుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో  తెలుసుకుందాం. ఈ పుచ్చకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పటికి మన శరీరానికి క్యాలరీలు మాత్రం తక్కువగా అదుతాయి. దీనిని తినడం వల్ల ఈజీగా మన కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం వేగంగా తగ్గవచ్చు.ఇంకా అలాగే పుచ్చకాయను తీసుకోవడం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. వేసవికాలంలో దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది.అయితే ఈ పుచ్చకాయని ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 దీన్ని ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో పోషకాల లోపం తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో మన శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు కూడా ఉండవు.కాబట్టి ఎక్కువ తినడం వల్ల పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ పుచ్చకాయ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వారు తినకపోవడం మంచిది. అలాగే దీన్ని ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి కావల్సినంత శక్తి లభించదు.  తరచూ ఆకలి అవుతుంది. ఇంకా అలాగే ఎక్కువ మొత్తంలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కడుపు ఉబ్బరం, డయేరియా వంటి జీర్ణసమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: