పాలల్లో లవంగాల పొడి వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..?

Divya
రోజు పరగడుపున కాఫీ,టీలు తాగడం అందరికీ అలవాటే.కానీ వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు అంతే మోతాదులో ఉంటాయని అందరికీ తెలిసినా,వదలలేక తాగుతుంటారు.అలాంటివారు క్రమంగా వాటి మొతాదు తగ్గించుకుంటూ ఔషదగుణాలు కలిగిన పానీయాలు తీసుకోవడంతో,చాలా అనారోగ్యాలు మన దరి చేరకుండా,ముందే జాగ్రత్త పడవచ్చు.ముఖ్యంగా పాలల్లో లవంగాల పొడిని వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ల‌వంగాల పొడిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ మరియు యాంటీ వైరల్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి.అంతే కాక ఇందులో పొటాషియం, క్యాల్షియం, ఐర‌న్ వంటి  పోష‌కాలు పుష్కళంగా లభిస్తాయి కూడా.
రోజూ ఉదయాన్నే గోరువెచ్చని పాలల్లో చిటికెడు లవంగాల పొడి వేసుకుని త్రాగడం వల్ల, జుట్టుకు కావలసిన పోషకాలు అంది, జుట్టు పొడవుగా మృదువుగా పెరుగుతుంది. ఇందులోని ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల రక్త శాతాన్ని వృద్ధి చేసి,రక్త సరఫరా సక్రమంగా జరిగేందుకు దోహదపడుతుంది.
రోజూ రాత్రి ప‌డుకోబోయే ముందు లవంగం పొడి వేసిన పాలను తాగటం వల్ల తొందరగా నిద్రకు ఉపక్రమించే అవకాశం ఉంటుంది. కొంతమంది దంతాల నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు.అలాంటివారు పడుకోబోయే ముందుగా లవంగాలను చ‌ప్పరిస్తూ నిద్ర‌పోవాలి.ఇలా చేయడం వ‌ల్ల క్ర‌మంగా దంతాల నొప్పులు త‌గ్గుతాయి.దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అధిక బ‌రువుతో ఇబ్బంది పడేవారు రోజూ ఉద‌యం ఖాళీ కడుపుతో ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను చప్పరించడం వ‌ల్ల అధిక బ‌రువును సులభంగా తగ్గించుకోవచ్చు.
అలాగే ల‌వంగాల‌ పాలు త్రాగటం వ‌ల్ల అధిక బీపీ కంట్రోల్ లో ఉంటుంది.లవంగాలను తరుచూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దానితో రకరకాల వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి దీర్ఘకాళిక అనారోగ్య స‌మ‌స్య‌లు బారిన ప‌డ‌కుండా ఉంటాము.జీర్ణ‌స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడేవారికి కూడా ల‌వంగాలు ఎంతో ఉపశమనంను కలిగిస్తాయి.పాలలోని క్యాలిషియం ఎముకల‌ను ధృడపరచడంలో సహాయపడతాయి.కావున ప్రతి ఒక్కరూ పరగడుపున లవంగం పాలను తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: