ఇనుప కడాయిలో ఎలాంటి పదార్థాలను వండకూడదో తెలుసా..?

Divya
పూర్వం వంట వండడానికి ఇనుప లోహంతో తయారు చేసిన కడాయిలు మాత్రమే వాడేవారు.వారు ఇనుప కడాయిలో వంట చేయడం వల్ల,ఈ ఇనుము వల్ల రక్తహీనత రాకుండా ఉంటుందని అపోహ పడేవారు. కానీ ఇనుప కడాయిలను అన్నిరకాల పదార్థాలను వండటానికి వాడకూడదు.దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.కానీ ఇప్పుడు రకరకాల లోహలతో తయారు చేసిన కడాయిలు వస్తున్నాయి.ఏ పదార్తానికి సరిపోతుందో అవగాహన తెచ్చుకొని,వండుకోవడం చాలా ఉత్తమం.ఒక వేల వండవలసి వస్తే ఇనుప కడాయి లో ఎలాంటి పదార్థాలను ఉండకూడదో ఇప్పుడు చూద్దాం..
మాంసం..
పూర్వం మన పెద్దలు చేసినట్టు,ఇనుప కడాయిలో మాంసం వండుకొని తింటే, అందులో వున్న చిలిమి మాంసంలో కలిసిపోయి,జీర్ణక్రియ శక్తిని దెబ్బతీస్తుంది. దీనితో అజీర్తి విరేచనాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ.
టమాటాలు..
టమాటాలను ఇనుప కడాయిలో వేసి వండ కూడదని, ఆహార నిపుణులు సూచిస్తున్నారు.దీనికి కారణం టమోటాలో ఉన్న,ఆక్సాలిక్ యాసిడ్ ఇనుముతో రసాయనక చర్య జరిపి,విషయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇది క్రమంగా దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
పాలకూర..
పాలకూరను ఇనుప కడాయిలో వండడం వల్ల, అందులోని ఆక్సాలిక్ యాసిడ్ ఇనుము తో కలిసిపోయి, నల్లగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
చింతపండు..
చింతపండును వాడే వంటలను ఇనుప కడాయిలో తయారు చేయడం వల్ల,ఇందులోని టార్టారిక్ ఆమ్లం, కెమికల్ రియాక్షన్ జరిపి,రుచిని మార్చడమే కాకుండా, పేగుసంబంధిత సమస్యలు కూడా కలగజేస్తుంది.
బీట్రూట్..
చాలామంది బీట్రూట్ వంటి వాటిని ఫ్రై చేయడానికి ఇనుప కడాయిలు వాడుతూ ఉంటారు.అలా వాడినప్పుడు,బీట్రూట్ లోని ఐరన్ కంటెంట్ తగ్గిపోయి, అందులోని పోషకాలన్నీ దెబ్బతింటాయి.
నిమ్మరసం..
ఇనుప కడాయి లో నిమ్మరసం తో కూడిన వంటలు చేయడం వల్ల,ఇందులోని సిట్రిక్ యాసిడ్,ఇనుప కడాయిలోనే చిలిమి తో రసాయనిక చర్య జరిపి, వంటలకు చేదు రుచిని తేవడమే కాక,ఎసిడిటీ,గ్యాస్ వంటివి కలుగజేస్తుంది.
కావున పైన చెప్పిన వంటలు చేసేటప్పుడు,ఒక కడాయిలు కాకుండా ఇతర లోహాలతో చేసిన పాత్రల్లో వండుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: