ఈ టీని తాగితే అన్ని రోగాలు పరార్?

Purushottham Vinay
టీ ని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి మేలు కలగదు. పైగా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ హెర్బల్ టీ ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీనిని తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా ఈజీగా దూరం చేసుకోవచ్చు. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఈ హెర్బల్ టీ ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి?  వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ టీ ని తయారు చేసుకోవడానికి  మనం దాల్చిన చెక్కను, యాలకులను, తులసి ఆకులను ఇంకా పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వాటిని వేడి చేయాలి. ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను, 10 తులసి ఆకులను ఇంకా 15 పుదీనా ఆకులను వేసుకోవాలి. తరువాత 2 లేదా 3 యాలకులను దంచి అందులో వేసుకోవాలి.


ఈ నీటిని ఒక కప్పు అయ్యే దాకా బాగా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. రుచి కోసం ఇందులో తేనె, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న హెర్బల్ టీ ని టీ తాగినట్టు కొద్ది కొద్దిగా జిప్ చేస్తూ తాగాలి. ఈ విధంగా హెర్బల్ టీని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది.అలాగే మనం తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. దగ్గు, జలుబు సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కూడా ఈజీగా తొలగిపోతుంది. గొంతు సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. శరీరంలో మలినాలు వెంటనే తొలగిపోతాయి. శరీరం బాగా శుభ్రపడుతుంది. ఈ విధంగా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది.సాధారణ టీ తాగే వారు దానికి బదులుగా ఇలా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: