చద్దన్నం వల్ల ఉపయోగాలు తెలిస్తే అసలు వదలరు..!!

Divya
పూర్వం మన పెద్దలు ఉదయాన్నే పొలాల్లో పనిచేసి,అక్కడే కూర్చొని చద్దన్నం మిరపకాయతో నంజుకు తింటూ ఉండేవారు.ఆ కాలంలో అది ఎంతో రుచిగా ఉండేదని మరియు దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగేవని నానమ్మలు,అమ్మమ్మలు చెబుతుంటారు.కానీ ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏది పడితే అది తినడము,టైం లేదంటూ అసలే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటారు.రోజంతా మన మెదడు పనితీరు కూడా మన మనం తినే అల్పాహారం మీద ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. అందుకే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోవాలి.మరీ ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు తినకుండా వదలరు.చద్దన్నం ఎలా చేసుకోవాలో,దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
చద్దన్నం తయారు చేసుకోవడానికి ఒక కుండలో అన్నం వండుకొని,అందులో తగినన్ని పాలు వేడి చేసి పోయాలి.అది బాగా చల్లారిన తర్వాత అందులో పెరుగు వేసి తోడు పెట్టి,మూత ఉంచి రాత్రంతా అలాగే వదిలేయాలి.ఆ మరునాడు ఉదయాన్నే మూత తీసి, అందులో మిరపకాయలు,ఉల్లి ముక్కలు,ఉప్పు బాగా కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి.దీనిని ఒక్కసారి తింటే,దాని రుచి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంతగా ఉంటుంది.వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది.
చద్దన్నం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
దీనిని తరుచూ తీసుకోవడం వల్ల,మన శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్లు,మెగ్నిషియం,పొటాషియం, ఐరన్‌,కాల్షియం పుష్కళంగా లభిస్తాయి.ఇది తీసుకున్న వారికి తక్షణమే శక్తి వస్తుంది.ఇందులోని క్యాల్షియం ఎముకలు దృఢంగా తయారు చేయడానికి సహాయపడుతుంది.వేసవిలో వీరేచనాలతో బాధపడేవారికి ఇవ్వడం వల్ల, వారికి నీరసం, నిస్సత్తువ తగ్గి చురుగ్గా ఉంటారు.చద్దన్నంతో మన జీర్ణవ్యవస్థకు అవసరం అయ్యే మంచి బాక్టీరియాను పెంచి, మలబద్ధకం,గ్యాస్,అసిడిటీ,అజీర్ణం వంటి జీర్ణసమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఇందులో అధికంగా వున్న పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది.అనిమియాతో బాధపడేవారికి, ఇందులోని ఐరన్ కంటెంట్ రక్తం వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.మరియు గుండెపనితీరును మెరుగుపరుస్తుంది.వేసవిలో కలిగే వేడిని తగ్గిస్తుంది.ఇందులోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.కావున ప్రతి ఒక్కరూ చద్దన్నం తినడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: